టాలీవుడ్ లో వరుస విజయాలతో యంగ్ టైగర్ ఎన్టీయార్ దూసుకుపోతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమా విజయాలతో జోరు మీదున్న జూనియర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. రోజురోజుకు టాలీవుడ్ లో జూనియర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇతర భాషల్లో హిట్లు కొట్టిన డైరెక్టర్లు కూడా జూనియర్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
మరోవైపు బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం వాయిదా వేస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం జరుగుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ కోసం ఇంకా కథలు వినలేదని మంచి కథ దొరికితే మోక్షజ్ఞ హీరోగా సినిమా మొదలవుతుందని కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ జూనియర్ క్రేజ్ చూసే బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదా వేశాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఎన్టీయార్ క్రేజ్ టాలీవుడ్ లో పీక్స్ లో ఉండగా బాలయ్య మార్కెట్ మాత్రం సినిమా సినిమాకు తగ్గుతోంది. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకోకపోతే కష్టమని భావించి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదా వేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మోక్షజ్ఞ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 
ఆ ఫోటోలలో మోక్షజ్ఞ ఓవర్ వెయిట్ తో ఉండటం గమనార్హం. చాలా రోజులుగా మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం శిక్షణ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నా మోక్షజ్ఞ లుక్స్ సాదాసీదాగా ఉండటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. క్రిష్, బోయపాటి మోక్షజ్ఞ సినిమా కోసం కథలు రెడీ చేసినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మరి మోక్షజ్ఞ ఎంట్రీ వాయిదాకు ఎన్టీయార్ క్రేజే కారణమో లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయో బాలయ్య స్పందిస్తే మాత్రమే తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: