పవన్ కళ్యాణ్ సాధారణంగా తన సినిమాలకు సంబంధించి హీరోయిన్స్ ఎంపికలోను ఆ సినిమాల ఎడిటింగ్ విషయంలోనూ ఏమాత్రం ఆసక్తి కనపరచడు. పవన్ సీరియస్ గా తన సినిమాల విషయం పట్టించుకుని ఉంటే పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఇంకా చాల బ్లాక్ బస్టర్ హిట్స్  వచ్చి ఉండేవి. 

అలాంటి పవన్ ఇప్పుడు మారిపోయాడ అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని కొంతమంది ఆశ్చర్య పోతున్నారు. ‘పింక్’ రీమేక్ సినిమాతో పవన్ రీ ఎంట్రీ ఖరార్ కావడంతో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపిక విషయంలో పవన్ కలగచేసుకుని నివేత థామస్ పేరుతో పాటు మరొక ఎవరు ఊహించని హీరోయిన్ పేరు పవన్ సూచించి షాక్ ఇచ్చినట్లు సమాచారం. 

గతంలో పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు హీరోయిన్ గా ఎంపిక అయి ఆ తరువాత తొలగింప బడ్డ అనిష అంబ్రోస్ పేరును నిర్మాత దిల్ రాజ్ కు పవన్ సూచించాడు అంటూ వార్తలు రావడం చాలామందికి షాక్ ఇస్తోంది. వాస్తవానికి వైజాగ్ ప్రాంతానికి చెందిన అనిషా పవన్ కు వీరాభిమాని మాత్రమే కాకుండా ఆమె కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 

పవన్ కు ఒకప్పటి సన్నిహితుడైన శరత్ మరార్ ద్వారా పవన్ కు పరిచయం కాబడ్డ అనీషా పై పవన్ కు ప్రత్యేక అభిమానం ఉంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ పవన్ అనీషాల సాన్నిహిత్యానికి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా అనీషాను ‘పింక్’ రీమేక్ లో ఒక హీరోయిన్ గా ఎంపిక చేయమని నిజంగానే పవన్ కళ్యాణ్ దిల్ రాజ్ కు సూచించాడా అంటూ నమ్మలేని ఈ వార్తల పై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: