మరికొన్ని రోజుల్లో 2019 సంవత్సరానికి శుభం కార్డు పడి...2020 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. అయితే ఈ 2019 సంవత్సరం తెలుగు చిత్రసీమకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. మునుపటి కంటే ఈ ఏడాది విజయాలు చాలా తగ్గాయి. ఏదో నెలకొక విజయం సాధించడమే గగనమైపోయింది. ఇక వాటిల్లో అమ్మిన రేటు కంటే మంచి లాభాలు సాధించి... ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న టాప్-10 టాలీవుడ్ సినిమాలు గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే..

 

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)

 

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు పలు పెద్ద హీరోల సినిమాలు వచ్చిన...ఈ చిత్రం మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. 32 కోట్లకు అమ్ముడుపోయిన చిత్రం దాదాపు 80 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేసి... సంక్రాంతి పండగకు పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

 

జెర్సీ

 

నేచురల్ స్టార్ నాని, ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జెర్సీ ‘. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇది ‘వన్ అఫ్ ది బెస్ట్’ ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 27 కోట్లతో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చిత్రం 28.1 కోట్ల వరకు కలెక్ట్ చేసి హిట్ సాధించింది.

 

మజిలీ

 

అక్కినేని నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. 2019లో ఈ మూవీకు కూడా ప్రేక్షకులు నుంచి విశేషదారణ లభించింది. 22 కోట్లకు అమ్ముడుపోయిన ఈ చిత్రం దాదాపు 38 కోట్లు వసూలు చేసింది.

 

చిత్రలహరి

 

సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మంచి సోషల్ మెసేజ్‌తో అద్భుతమైన డైలుగులతో కూడిన ఈ మూవీ యువతను ఆకట్టుకుంది. ఈ చిత్రం 14 కోట్లతో బాక్సాఫీస్ బరిలో దిగి  15 కోట్లు సాధించింది.

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

 

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. 2019లో చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారింది.

 

బ్రోచేవారెవరురా

 

శ్రీ విష్ణు, నివేద థామస్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిని ప్రధాన పాత్రలతో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.  

 

మహర్షి

 

ఇక 2019లో భారీ బ్లాక్ బస్టర్ అయింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం. ఈ చిత్రం 100 కోట్ల షేర్ వసూలు చేసి మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

 

ఇస్మార్ట్ శంకర్

 

హీరో రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది...‘ఇస్మార్ట్ శంకర్’.20 కోట్లతో బరిలో దిగిన ఇస్మార్ట్...దాదాపు 37 కోట్లు వసూలు చేసింది.

 

ఓ బేబి

 

‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘ఓ బేబి’ చిత్రంలో సమంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషించారు. దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 

ఖైదీ

 

కార్తీ ప్రధాన పాత్రలో వచ్చిన ఖైదీ చిత్రం...ప్రేక్షకుల ప్రశంసలతో పాటు...బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కూడా కురిపించింది. అవ్వడానికి తమిళ డబ్బింగ్ సినిమా అయిన తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: