సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది కొన్ని పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఆ పాటలు ఏడాది పొడవునా ప్రేక్షకుల మదిలో తిరుగుతూనే ఉంటాయి. అలా 2019లో ప్రేక్షకులని మైమరిపించిన పాటలపై ఓ లుక్కేస్తే....ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న పాట ఏదైనా ఉందంటే...అది ‘సామజవరగమన’ సాంగ్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సామజవరగమన ఓ ఫీవర్‌లాగా పట్టుకుంది. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దరకత్వంలో 2020 జనవరి 12న విడుదల కానున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేసింది. ఈ పాట 114 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.  

 

ఇక ఇదే చిత్రం నుంచి వచ్చిన ‘రాములో రాములా’ అంటే పాట కూడా దుమ్ములేపింది. ఇది 100 మిలియన్ వ్యూస్ అందుకుంది. దీని తర్వాత మహర్షి చిత్రం నుంచి ‘ఇదే కదా ఇదే కదా’, ‘పదర పదర’ అనే పాటలు కూడా ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇక అలాగే చిత్రలహరి నుంచి ప్రేమ వెన్నెల అనే పాట, మజిలీ నుంచి ‘ప్రియతమా ప్రియతమా’ అనే పాటలు యూత్‌ను తెగ ఆకట్టుకున్నాయి. అలాగే వినయ విదేయ రామ చిత్రం నుంచి తందానే తందానే అనే ఫ్యామిలీ సాంగ్, ఏక్ బార్ ఏక్ బార్ అనే మాస్ బీట్‌లు కూడా అదిరిపోయాయి. ఎఫ్2 నుంచి గిర్రా గిర్రా, రెచ్చిపోదాం అనే పాటలు కుడా బాగా పాపులర్ అయ్యాయి.

 

అటు జెర్సీ చిత్రంలోని అదేంటో గానీ ఉన్నపాటుగా, గ్యాంగ్ లీడర్ చిత్రానికి వచ్చే సరికి టైటిల్ సాంగ్, హొయినా హొయినా అనే పాటలు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ఇస్మార్ట్ శంకర్‌లో ‘దిమాక్ ఖరాబ్’ ఉండిపో’ ‘జిందాబాద్’ టైటిల్ సాంగ్ చాలా పాపులర్ అయ్యాయి. అలాగే గద్దలకొండ గణేశ్‌లో ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ కూడా దుమ్ముదులిపింది. అదేవిధంగా ‘ఏమై పోయావే’, ‘పడి పడి లేచే మనసు’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే బాలయ్య నటించిన రూలర్‌లోని ‘పడతాడు పడతాడు’ సాంగ్ కూడా మెప్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: