డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఫైటర్. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బాడీ బిల్డ్ కూడా చేస్తున్నాడు. విజయ్ కు తగ్గ కథ రాసుకున్న పూరి జగన్నాధ్ అందుకు తగ్గట్టుగా ఫిట్ గా ఉండాలని అనడంతో విజయ్ ఆ పనిలో ఉన్నాడు. మరోపక్క సినిమాలో నటించే నటీనటుల విషయంలో పూరీ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్ గా నటిస్తోందని ఇప్పటికే తెలిసిన విషయమే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై వార్తలు వస్తున్నాయి.

 

 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకున్నట్టు లేటెస్టుగా అందుతున్న సమాచారం. విజయ్, జాన్వీ తర్వాత ఎంపికైన నటి రమ్యకృష్ణ మాత్రమే. ఈ సినిమాను చాలా గ్రాండియర్ గా తెరకెక్కించనున్నాడు పూరి జగన్నాధ్. అందుకే పవర్ ఫుల్ పాత్రలకు అందుకు తగ్గ నటీనటులనే ఎంచుకుంటున్నాడు పూరి. ఈ కోవలోనే ముఖ్యమైన పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నట్టు సమాచారం. అమ్మా నాన్న తమిళ అమ్మాయి తరహాలో ఈ సినిమాలో కూడా తల్లి పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. అందుకే రమ్య వైపు పూరి మొగ్గు చూపాడని అంటున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీగా తెరకెక్కించనున్నాడట.

 

 

ఇండియాతో పాటు అమెరికాలో కూడా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను పూరి, చార్మీలతో కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నట్టు సమాచారం. జాన్వీ ఈ సినిమాలోకి ఎంటర్ కావడానికి కారణం కూడా కరణ్ జోహార్ అనే వార్తలు వస్తున్నాయి. గ్రాండ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి అదే ఏడాది విడుదల చేయటానికి పూరి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: