టాలీవుడ్‌లో స్టార్ డైరక్టర్లలో కొరటాల శివ ఒకరు. ప్రభాస్ ‘మిర్చి’తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన కొర‌టాల ఆ త‌ర్వాత వ‌రుస‌గా శ్రీమంతుడు - జ‌న‌తా గ్యారేజ్ - భ‌ర‌త్ అనే నేను సినిమాల‌తో వ‌రుస‌గా దూసుకు పోతున్నాడు. నాలుగు వ‌రుస సూప‌ర్ హిట్లు. నాలుగు సినిమాలు కూడా సూప‌ర్ స్టార్ హీరోల‌తో చేసిన‌వే. నాలుగు సినిమాలు ఆయా హీరోల కెరీర్‌లో మంచి హిట్లుగా నిలిచాయి.

 

వరుసగా నాలుగు సక్సెస్‌లను ఖాతాలో వేసుకొని.. మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని ఆయన డైరక్ట్ చేయబోతున్నారు. చిరంజీవి 152వ సినిమాకు కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.  

 

ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా త్రిష పేరు ప‌రిశీల‌న‌కు వ‌స్తుంద‌ని అంటున్నారు. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం చిరు సినిమా కోసం కొరటాల శివ‌కు భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. చిరు మూవీ కోసం దాదాపుగా 15కోట్లు కొరటాల పుచ్చుకుంటున్నట్లు టాక్. కొర‌టాల‌కు ఆ మాత్రం రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌వ‌చ్చ‌నే అంటున్నారు.

 

ఇప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల చేసిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్ అయ్యాయి. అందుకేక కొర‌టాల‌కు ఆ మాత్రం రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డంలో త‌ప్పు లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. చిరంజీవి, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చే ఈ చిత్రం దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్‌లో ఇప్పుడున్న దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యధిక పారితోషికం అందుకుంటున్నారట. బాహుబలి 1, 2 చిత్రాలకు కలిపి రూ.50కోట్లు తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రు.30 కోట్లు తీసుకుంటున్నాడ‌ట‌.


 

మరింత సమాచారం తెలుసుకోండి: