యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న రూల‌ర్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రికొద్ది గంట‌ల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, సీనియ‌ర్ హీరోయిన్ భూమిక‌, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ త‌దిత‌రులు  ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అని తేల్చి చెప్పేశాయి. ట్రైలర్ లో కేవలం యాక్షన్ సీన్స్ ని మాత్రమే హైలెట్ చేశారు. కథలో మెయిన్ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఒకవేళ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి హిట్ ని అందుకుంటుంది.

 

ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలయ్య సినిమాలకు ఇంత తక్కువ బిజినెస్ జరగటం ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. వ‌రుస ప్లాపుల‌తో పాటు రోజు రోజుకు బాల‌య్య‌కు క్రేజ్ త‌గ్గుతోన్న నేప‌థ్యం, రొటీన్ క‌థ‌ల‌తో సినిమాలు చేస్తుండ‌డంతోనే ఈ సినిమాకు త‌క్కువ బిజినెస్ జ‌రిగింద‌ని అంటున్నారు. గ‌తంలో బాల‌య్య - కేఎస్‌.ర‌వికుమార్ కాంబోలో వ‌చ్చిన జై సింహా రు.28 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

 

రూల‌ర్ ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ (రూ.కోట్లలో) :


నైజాం - 5.5 కోట్లు

 

వైజాగ్ - 2.5 కోట్లు

 

ఈస్ట్ - 1.6 కోట్లు

 

వెస్ట్ - 1.4 కోట్లు

 

కృష్ణ - 1.6 కోట్లు

 

గుంటూరు - 2.7 కోట్లు

 

నెల్లూరు - 1.1 కోట్లు

 

సీడెడ్ - 5.00 కోట్లు
--------------------------------
ఏపీ & టీఎస్ = 21.4 కోట్లు
--------------------------------

కర్ణాటక - 1.8 కోట్లు

 

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.5 కోట్లు

 

ఓవర్సీస్ - 0.3 కోట్లు
--------------------------------------
వరల్డ్ వైడ్ బిజినెస్ = 24 కోట్లు
--------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: