మరో తెలుగు సినిమా ఛాన్స్  కొట్టేసిన అలియా హీరో ఎవరంటే.. 


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ చిత్రం భారీ కథతో భారీ కథనంతో తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యి చాలా కాలం అయినా కూడా ఈ చిత్రం నుండి  ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో కొంత నిరాశలో ఉన్న కూడా సినిమాలో అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో 80 % షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటించింది. 


ఒకప్పుడు సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు రీజినల్‌ సినిమాలు కూడా హిందీ సినిమాలకు గట్టి పోటి ఇస్తుండటంతో ఉత్తరాది భామలు కూడా సౌత్‌ సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న ఓ బాలీవుడ్‌ బ్యూటీ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పింది.

 

తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. విభిన్న చిత్రాలతో హీరోగా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ ఏర్పరుచుకున్న నటుడు అడివి శేష్‌. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం మేజర్‌లో అలియా కీలక పాత్రలో నటిస్తుందన్న టాక్‌ వినిపిస్తోంది. 26/11 దాడుల్లో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.

 

ప్రస్తుతం ఈ భామ మూడు సినిమాలతో బిజీగా ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా బ్రహ్మస్త్ర సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఒకప్పటి బాలీవుడ్ సూపర్‌ హిట్ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్‌ 2 సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు భారీ చిత్రాల్లో  నటిస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: