ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతున్న విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ సీట్లలో కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో టీడీపీ, చంద్రబాబు ఉన్న సమయంలో బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ఈరోజు విడుదలయింది. 
 
రూలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉంటే తెలుగుదేశం పార్టీ ఊపిరి పీల్చుకోవడానికి, పార్టీ పరిస్థితులు మెరుగుపడటానికి అవకాశం ఉండేది. కానీ రూలర్ సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే చంద్రబాబుకు రూలర్ సినిమా ఫలితం ఏ మాత్రం ఉపయోగపడదని సమాచారం. బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ఫలితం తెలుగుదేశం పార్టీ వీరాభిమానుల్ని కూడా నిరాశకు గురి చేస్తూ ఉండటం గమనార్హం. 
 
కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రూలర్ సినిమా ఈరోజు విడుదలైంది. జైసింహా కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అమెరికాలో ఇప్పటికే రూలర్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి నుండే రూలర్ సినిమా సందడి మొదలైంది. సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ బాగానే ఉందని సెకండాఫ్ మాత్రం బాలయ్య తీవ్రంగా నిరాశపరిచాడని చెబుతున్నారు. రూలర్ సినిమా రొటీన్ కథ కావటంతో పాటు సన్నివేశాల్లో సాగదీత ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్ గా మారింది. చిరంతన్ భట్ సంగీతం కూడా సోసోగానే ఉండటం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తోంది. బాలకృష్ణ వీరాభిమానులకు మాత్రమే రూలర్ సినిమా నచ్చే అవకాశం ఉందని సమాచారం. రూలర్ సినిమా అటు బాలయ్య ఆశలను, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆశలను నీరుగార్చిందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: