ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ సెలెబ్రెటీల ఆదాయానికి సంబంధించి మాత్రమే కాకుండా వారి పాపులారిటీకి సంబంధించి కూడ ప్రతి సంవత్సరం ర్యాంకులు ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్స్ నిర్ణయించే విషయంలో ఎటువంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఈ పత్రిక ప్రతి సంవత్సరం ప్రకటించే ర్యాంక్ ల వార్తలు మాత్రం ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి.

ఇలాంటి పరిస్థితులలో ఫోర్బ్స్ లేటెస్ట్ గా ప్రకటించిన పాపులారిటీ లిస్టులో టాలీవుడ్ నుండి ఇద్దరు హీరోలకు మాత్రమే స్థానం దక్కింది. ‘సాహో’ ఫెయిల్ అయినప్పటికీ టాప్ 100 ఇండియన్ సెలెబ్రెటీల లిస్టులో ప్రభాస్ కు 44వ స్థానం దక్కితే మహేష్ కు 54వ స్థానం దక్కింది.

అయితే ఈ లిస్టులో రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లకు స్థానం దక్కకపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. అయితే 65 సంవత్సరాలు దాటిపోయిన రజినీకాంత్ కు జాతీయ స్థాయిలో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అన్న విషయాన్ని రుజువు చేస్తూ ఈ ర్యాంకింగ్స్ లో రజినీకాంత్ కు 13వ స్థానం రావడం రజినీ మ్యానియాను సూచిస్తోంది. 

కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ 47వ స్థానం అజిత్ కు 52వ స్థానం వస్తే కమలహాసన్ కు 56వ స్థానం లభించింది. ఇక దర్శకుడు శంకర్ కు 55వ స్థానం లభిస్తే త్రివిక్రమ్ కు 77వ స్థానం లభించింది. అయితే ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళికి ఈ పాపులారిటీ లిస్టులో చోటు దక్కకపోవడం మరింత ఆశ్చర్యం. ఈ పాపులారిటీ లిస్టులో విరాట్ కోహ్లీకి నెంబర్ వన్ స్థానం దక్కడంతో ఆదాయంలోనే కాకుండా పాపులారిటీలో కూడ విరాట్ దేశ వ్యాప్తంగా తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి ఈ లిస్టులో ఎదో ఒక స్థానంలో తమకు స్థానం లభిస్తుందని చరణ్ జూనియర్ లు భావించినా వారికి ఊహించని షాక్ తగిలింది అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: