నందమూరి నటసింహం అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ వాళ్ల కోసం ఎంతో ఉత్సాహంతో నటిస్తాడు. నందమూరి వంశ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన నాటి నుంచీ ఇదే పరిస్థితి. డ్యాన్సులు, ఫైట్లు, యాక్షన్, డైలాగులు.. వీటన్నింటిలో బాలయ్యది ప్రత్యేకమైన శైలి. కథ కథనాల్లో తనదైన మార్కు ఉండేలా ప్రయత్నిస్తూంటాడు. ఆయన కెరీర్లోని సినిమాలను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన రూలర్ గా కొత్త సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా బలకృష్ణ అభిమానుల కోసమే ప్రత్యేకంగా ఉందంటున్నారు.

 

 

బాలయ్య తన ప్రతి సినిమాలో ఒకటే తరహాలో వెళ్తున్నాడనే టాక్ ఉంది. కథలో వైరుధ్యం చూపించినా కథనంలో మాత్రం తన మార్కు ఉండేలా చూసుకుంటున్నాడు. దీంతో డైలాగులు, సన్నివేశాలు గత బాలయ్య సినిమాల్లానే ఉంటున్నాయనే టాక్ వస్తోంది. ఇందుకు కారణం బాలయ్య తాను నమ్మిన దారిలోనే వెళ్తూండటం కూడా ఓ కారణం. కొత్త పోకడలు, కథలు గురించి ఆయన తెలుసుకోడు అనే టాక్ ఉంది. ఆయన దగ్గరకు వచ్చే కథల్లోనే కొత్తదనం ఉండేలా దర్శక, నిర్మాతలు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు నందమూరి వంశ అభిమానులం.. అనేప్పటికి కొందరితో సినిమాలు చేసి కెరీర్ పరంగా పరమ చెత్త సినిమాలు చేసాడు. ఇప్పుడు రూట్ మార్చినా.. సినిమాలు మాత్రం ఒకటే తరహాలో వస్తున్నాయి.

 

 

నిజానికి బాలయ్యలో బొలెడంత ఎనర్జీ ఉన్నా సరిగా ఉపయోగించుకోని డైరక్టర్లే ఎక్కువ. బాలయ్యకు బాగా కలిసొచ్చిన డైరక్టర్లంటే కోడి రామకృష్ణ, బి.గోపాల్, బోయపాటి శీను పేర్లు వినిపిస్తాయి. వీళ్లందరూ బాలయ్యను తెరపై చూపించే విధానంలో తేడాలుండేవి. కానీ నేటి దర్శకులు ఈ లాజిక్ మిస్ అవుతూ బలయ్యను ఓ మూస పద్దతికి ఫిక్స్ చేసేసారు. దీని నుంచి బయటపడితే బాలయ్య నుంచి కొత్త తరహా సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: