నందమూరి బాలకృష్ణ హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమా ఈరోజు విడుదలైంది. బాలకృష్ణకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్, భూమిక ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. బాలయ్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అవుతూ ఉండటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ బాలయ్య అభిమానుల ఆశలను రూలర్ తో మరోసారి నిరాశపరిచాడనే చెప్పవచ్చు.
 
సినిమా విడుదలకు ముందే బాలకృష్ణ లుక్స్ పై ప్రేక్షకుల్లో డివైడ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు బాలయ్య మరోసారి నిరాశపరిచాడన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ బాగానే నటించినా బాలకృష్ణ ఎనర్జీ తప్ప సినిమాలో మరేమీ లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు బాలయ్య రొటీన్ మాస్ యాక్షన్, పంచ్ డైలాగులు తప్ప సినిమాలో మరేం లేదని చెబుతున్నారు. 
 
సినిమా చూసిన ప్రేక్షకులు బాలయ్య మంచోడే కానీ సినిమాలే నిరాశపరుస్తున్నాయని చెబుతున్నారు. దర్శకులు బాలకృష్ణను ఉపయోగించుకోవటంలో విఫలమవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన మాస్ కథ పడితే బాలయ్య తన నటనతో కొత్త రికార్డులు క్రియేట్ చేయగలడు... కానీ దర్శకులు బాలయ్యతో రొటీన్ మూస మాస్ మసాలా సినిమాలు తీస్తూ బాలకృష్ణ ఇమేజ్ ను సరిగ్గా వాడుకోవటం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 
 
బాలయ్య అతి మంచితనమే బాలయ్య సినిమాలు ఫ్లాప్ కావటానికి కారణమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాలకృష్ణ ఒక్కసారి కథ విని ఫైనల్ చేసిన తరువాత బాధ్యతలు పూర్తిగా దర్శకుల చేతిలో పెట్టేస్తాడు. కానీ దర్శకులు మాత్రం బాలకృష్ణ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. గడచిన దశాబ్ద కాలంలో బోయపాటి శ్రీను మాత్రమే బాలయ్య ఇమేజ్ కు తగ్గ కథలతో బాలయ్యతో హిట్లు కొడుతున్నాడు. బాలయ్య కొంచెం మంచితనాన్ని తగ్గించుకొని మంచి కథలను, డైరెక్టర్లను ఎంచుకొని హిట్లు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: