బాలకృష్ణ రూలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.  రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలా ఉన్నదో చెప్పక్కర్లేదు.  సినిమాపై నమ్మకాలు ఉన్నాయి.  సినిమా ప్లాప్ లేదా హిట్ అన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది.  అందుతున్న సమాచారం ప్రకారం సినిమా యావరేజ్ అనే టాక్ వస్తున్నది.  ఇదంతా వేరే విషయం అనుకోండి.  అసలు విషయం ఏమిటంటే... బాలకృష్ణ తన కోరికను నెరవేర్చుకోబోతున్నారు.  అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.  


బాలకృష్ణకు చాలా కాలం నుంచి ఓ కోరిక ఉన్నది.  అది ఎలాగైనా దర్శకత్వం వహించాలి అని.  ఆ కోరిక ఇప్పటి వరకు నెరవేరలేదు.  బాలయ్య ఎన్ని సినిమాలు చేసినా ఆ కోరిక మాత్రం అలానే ఉండిపోయింది.  గతంలో బాలయ్య నర్తనశాల సినిమా సమయంలో మెగాఫోన్ పట్టుకున్నాడు.  కానీ, అనుకోని విధంగా ఆటంకాలు ఎదురయ్యాయి.  అదే సమయంలో సౌందర్య ప్రమాదంలో మరణించింది.  దీంతో ఆ సినిమా పక్కనపడింది.  


పాపం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా బాలయ్యకు మెగాఫోన్ పట్టుకోవడం మాత్రం కుదరలేదు అని చెప్పాలి.  ఇప్పుడు మరలా మెగాఫోన్ పట్టుకుంటాడని వార్తలు వస్తున్నాయి.  మెగాఫోన్ పట్టుకోవడానికి బాలయ్య తెగ తాపత్రయ పడుతున్నారు.  అంతేకాదు, బాలయ్యబాబు కొన్ని సినిమాల విషయంలో వెనకబడిపోయారని చెప్పాలి.  సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లు వరసగా సినిమాలు హిట్స్ కొడుతున్నారు.  


తమలో ఇంకా ఆ దూకుడు తగ్గలేదని నిరూపిస్తుంటే, బాలయ్య మాత్రం ఈ కేటగిరిలో వెనకబడ్డాడు.  రొటీన్ కథలు చేస్తూ, అదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను నమ్ముకొని ఇబ్బంది పడుతున్నారు.  ఇప్పటికే బాలయ్య ఈ విషయంలో అందరికంటే వెనుకబడ్డారు.  ఇక ఇదిలా ఉంటె, బాలకృష్ణ ఇప్పుడు కొత్తగా మరలా మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.  ఆదిత్య 999 పేరుతో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కథ కలలో వచ్చిందని, సినిమా కథను తెల్లారే సరికి రెడీ చేయించినట్టు తెలుస్తోంది.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: