తెలుగులో కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యం ఎక్కువ. వీటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించాలంటే కొంచెం సాహసించాల్సిందే. ఎంతోమందిని కాన్వాస్ చేయాల్సి ఉంటుంది. కుటుంబ విలువలు తెలియాలి, సందడి గురించి అవగాహన ఉండాలి, సెంటిమెంట్స్ ను ఫీల్ కావాలి. ఇలాంటి భావయుక్తమైన హృదయం ఉంటేనే కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించగలుగుతారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ప్రతిరోజూ పండుగే సినిమా ఇదే తలపిస్తోంది. సినిమా ఆద్యంతం దర్శకుడు మారుతి పనితనమే కనిపిస్తోంది.

 

 

సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన పాత్రలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తెరమీద అంత క్యాస్టింగ్ ఉన్నా బోర్ కొట్టకుండా ఉందంటే ఇది దర్శకుడిగా మారుతి పనితనానికి నిదర్శనంగా చెప్పుకోవాల్సిందే. ఎక్కడా తడబడకుండా కథ మీద పట్టు ఉంటేనే ఇది సాధ్యం. గతంలో వచ్చిన కృష్ణవంశీ  ఫ్యామిలీ మూవీస్ చూస్తే ఇదే అర్థమవుతుంది. మురారి, గోవిందుడు అందరివాడేలే, మొగుడు.. లాంటి సినిమాల జయాపజయాలను పక్కన పెడితే ఓ ఫ్యామిలీ మూవీ, అంతకుమించి తెర మీద ఓ కుటుంబాన్నే చూసిన అనుభూతి కలుగుతుంది. మారుతి ఇక్కడే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మారుతికి ఇలాంటి సబ్జెక్టు కొత్తే అయినా జాగ్రత్తగా తీసాడు. సెకండాఫ్ లో కొంత లాగింగ్ సీన్లు పక్కన పెడితే తాను అనుకున్నది అనుకున్నట్టు ప్రెజెంట్ చేసాడనే చెప్పాలి.

 

 

ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కు హిట్ లభించిందనే చెప్పుకోవాలి. ముఖ్య పాత్రల్లో నటించిన సత్యరాజ్, రావు రమేశ్, రాశీ ఖన్నా.. ల నుంచి కూడా మంచి నటనను రాబట్టి ప్రేక్షకులను మెప్పించటంలో దర్శకుడిగా మారుతి పనితనం బాగుందనే చెప్పుకోవాలి. సాయి ధరమ్ యాక్షన్, భావోద్వేగాలు పండించడంలో సక్సెస్ అయ్యాడు. మారుతి అలా రాబట్టుకున్నాడు.. తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: