ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో వచ్చి చాలా కాలం తరువాత  బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు  సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈచిత్రం   తరువాత  వెంకీ  మరో మల్టీ స్టారర్  వెంకీ మామలో నటించాడు.  కొద్దీ రోజుల క్రితం విడుదలైన ఈచిత్రం ప్రస్తుతం డీసెంట్ వసూళ్లను రాబడుతూ హిట్ దిశగా పయనిస్తుంది.  ఇక ఈ చిత్రం  తరువాత  వెంకీ , ప్రస్తుతం కోలీవుడ్  బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ  అసురన్ తెలుగు రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.   ప్రీ ప్రొడక్షన్  దశలో  వున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  జనవరి 2 నుండి సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం.
 
 
కాగా ఈ రీమేక్ ను   సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్  శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటివరకు క్లాసికల్ సినిమాలను  తీసిన శ్రీకాంత్ అడ్డాల  మొదటి   సారి  పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను  డీల్ చేయనుండడం తో  సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఒరిజినల్ వెర్షన్  ను నిర్మించిన  కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మించనున్నాడు. ఈచిత్రంలో  శ్రీయ శరన్  హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.
 
 
ఇక  తమిళ హీరో  ధనుష్ - వెట్రిమారన్ కాంబినేషన్ లో తెరకెక్కిన  అసురన్  ఇటీవల  కోలీవుడ్ లో విడుదలై  బాక్సాఫీస్  వద్ద  కలెక్షన్ల వర్షం కురిపించింది.  రూరల్ బ్యాక్ డ్రాప్ లో  లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం   ప్రపంచ వ్యాప్తంగా 70కోట్లగ్రాస్ వసూళ్లను రాబట్టి  సెన్సేషన్ సృష్టించింది. మరి ఇప్పుడు తెలుగులో రీమేక్ అవ్వనున్న  ఈ చిత్రం  ఎలాంటి  ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: