నిన్న విడుదలైన నాలుగు సినిమాలలో మంచి టాక్ తెచ్చుకున్న మూవీగా ‘ప్రతిరోజు పండగే’ నిలబడింది. ఈ సినిమాకు రివ్యూలతో పాటు సగటు ప్రేక్షకుల స్పందన కూడ బాగానే రావడంతో ఈ సినిమాకు విజయం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనితో క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన అన్ని సినిమాలలో ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయితే కలక్షన్స్ పరంగా ఈ మూవీకి జనం ఎంతవరకు సహకరిస్తారు అన్నది ఈ వీకెండ్ తరువాత అసలు విషయం బయటపడుతుంది.


అయితే ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ కెరియర్ కు ఎంతవరకు సహకరిస్తుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈసినిమాలో హీరో సాయి తేజ్ అయినప్పటికీ కథరీత్యా సత్యరాజ్ హీరో. ఈమూవీలో 
పెర్ఫామెన్స్ ప‌రంగా చూస్తే తేజ్ కంటే రావు ర‌మేష్ హైలైట్ అయ్యాడు.


దీనితో ఈసినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు రావు రమేశ్ నటనకు విపరీతంగా కనెక్ట్ అవుతూ అతడి నటనను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రావు రమేశ్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికితోడు ఈమ‌ధ్య కాలంలో సగటు ప్రేక్షకుడు ఏసినిమాలోను ఇంతగా నవ్వుకోలేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. 


ముఖ్యంగా ఈ సినిమాను నడిపించడంలో దర్శకుడు మారుతి సత్య రాజ్ రావు రమేశ్ పాత్రలను ఎలివేట్ చేసి సాయి తేజ్ ను ఎలివేట్ చేయడంలో అంత శ్రద్ధ చూపలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో సాయి తేజ్ చెప్పుకోవడానికి ఈ మూవీ అతడి ఖాతాలో హిట్ కింద జమ అయినా హీరోగా సాయి తేజ్ ను ఎలివేట్ చేయడంలో ఈమూవీ పెద్దగా అతడి కెరియర్ కు సహకరించక పోవచ్చు అని కొందరు చేస్తున్న కామెంట్స్ సాయి తేజ్ కు విజయంలో నిరాశను మిగిల్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: