మెగా మేన‌ళ్లుడు సాయి తేజ్ – రాశీ ఖన్నామారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పండ‌గ చేస్కొంది. వాస్త‌వంగా నాలుగు సినిమాల పోటీ నేప‌థ్యంలో త‌క్కువ థియేట‌ర్లో వ‌చ్చిన ఈ సినిమాకు మ‌రి యునాన‌మ‌స్ హిట్ టాక్ అయితే రాలేదు. జ‌స్ట్ ఓకే అనే ఎక్కువ మంది అన్నారు. రేటింగ్ లు కూడా అహా... ఓహో అనేలా లేవు.

 

అయితే కంప్లీట్ ఫ్యామిలీ కోణంలో సినిమా క‌థ ఉండ‌డం.. ఎమోష‌న్‌.. తాత‌, మ‌న‌వళ్ల సెంటిమెంట్ ఇవ‌న్నీ ఉండ‌డంతో పాటు మారుతి ఎంచుకున్న లైన్ బాగుండ‌డంతో సినిమా టాక్ కు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. ఇక శుక్ర‌వారం ఈ సినిమాకు పోటీగా మ‌రో మూడు సినిమాలు వ‌చ్చినా ఆ మూడు సినిమాల కంటే ప్ర‌తిరోజు పండ‌గ సినిమాకే మంచి టాక్ రావ‌డంతో సాయంత్రానికి ఈ సినిమా బాగా పుంజుకుంది.

 

చిత్ర‌ల‌హ‌రి రు.13 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిరోజు పండ‌గే సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా సుమారు 18 కోట్ల బిజినెస్ జ‌రిగింది. మొదటి రోజే 3.21 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది. సంక్రాంతి వ‌ర‌కు పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో ప్ర‌తిరోజు పండ‌గే అప్ప‌టి వ‌ర‌కు థియేట‌ర్లలో పండ‌గ చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఏదేమైనా సాయి తేజ్ కెరీర్ కు క‌రెక్టు టైంలో మ‌రో క‌రెక్ట్ అయిన హిట్ సినిమా రావడంతో అత‌డి కెరీర్ మ‌ళ్లీ స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

 

‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

 

నైజాం – 1.28 కోట్లు

 

సీడెడ్ – 35 లక్షలు

 

గుంటూరు – 30 లక్షలు

 

ఉత్తరాంధ్ర – 34 లక్షలు

 

ఈస్ట్‌ – 31 లక్షలు

 

వెస్ట్‌ – 23 లక్షలు

 

కృష్ణా – 22 లక్షలు

 

నెల్లూరు – 18 లక్షలు
---------------------------------------
ఫస్ట్ డే మొత్తం షేర్ – 3.21 కోట్లు
---------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: