వెంకటేష్, నాగచైతన్య నటించిన వెంకిమామ డిసెంబర్ 13 న విడుదలయ్యింది విషయం తెలిసిందే.. అలాగే ఈ చిత్రం ఘానా విజయం అయినా సంగతి  తెలిసిందే.. అందుకే ఈ చిత్రం సక్సెస్ అయిన సందర్బంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. గుంటులోని ఓ ప్రవేటు  పంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో చిత్ర బృందం సందడి చేశారు. వెంకటేష్ మాత్రం మరింత ఎక్కువ అల్లరి చేశారు. 


కాగా, ఈ సందర్బంగా భార్యలపై భర్తలు తమకు కంప్లైంట్ చేస్తున్నారని అన్నారు హీరో వెంకటేశ్. అసలు ఆయన దగ్గర భార్యలపై భర్తలు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు.  అన్న విషయం వింటే షాక్ అవ్వాల్సిందే అని అందరు అంటున్నారు. ఇక వివరాల్లోకెళ్తే.. భార్యలపై భర్తలు కంప్లైంట్ చేస్తున్నారని వెంకటేశ్ అనడం విశేషం. అంటే సీరియస్‌గా కాదులెండి.. కామెడీగా. ‘వెంకీమామ’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సినిమా సక్సెస్‌కు కారణం మహిళా ప్రేకకులు కీలక భూమికను పోషించారని వెంకటేశ్ తెలిపారు. 


ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ ..ఈ సినిమాకు ప్రేక్షకులకు అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. చైతన్య ఒకడే నన్ను ‘వెంకీమామ’ అని పిలిచేవాడు. ఇప్పుడు అందరూ ప్రేమగా ‘వెంకీమామ’ అని పిలుస్తున్నారు. మహేష్‌ని తమ్ముడు అనగానే హిట్ చేశారు.. వరుణ్ తేజ్‌ని కో బ్రదర్ అనగానే హిట్ చేసేశారు. ఇప్పుడు చైతు వెంకీమామ అనగానే హిట్ చేశారు. 


సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మహిళా ప్రేక్షకులే. వారు థియేటర్‌కి వచ్చి ఈలలు వేస్తూ గోల చేస్తున్నారు. దీంతో వారి భర్తలు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుండి వయసు మళ్లిన బామలు వరకు సినిమాలు చూస్తున్నారు. ఈ ప్రేమ చూస్తుంటే 30 ఏళ్ల వయసులోనే ఉండిపోతాను అని వెంకటేష్ అన్నారు. వెంకటేష్ మాటలు ప్రస్తుతం సోషల్ మెడిలో వైరల్ గా నిలిచాయి.. ప్రస్తుతం వెంకటేష్ ఆశారాం సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: