ఇప్పుడు టాలివుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాల నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మంచి లాభాలు ఉండటంతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, నానీ వంటి హీరోలు నిర్మాణ రంగంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మహేష్ బాబు ఇప్పటికే సక్సెస్ అయ్యారు కూడా. ప్రభాస్ చేతిలో యువి క్రియేషన్స్ ఉంది. ఆ బ్యానర్ మీద పలు సినిమాలు నిర్మిస్తున్నాడు ప్రభాస్. మహేష్ బాబు సినిమా థియేటర్ మీద కూడా దృష్టి పెట్టారు.

 

ఆ హక్కులు ఈ హక్కులు అంటూ సినిమాల మీద మంచి లాభాలే వస్తున్నాయి. ఇక సినిమా హిట్ అయితే వచ్చే లాభాలు కూడా భారీగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా నిర్మాణాల మీద దృష్టి పెట్టారనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వచ్చే ఏడాది మంచి రోజు చూసుకుని నిర్మాణ సంస్థను లాంచ్ చేసే ఆలోచనలో తారక్ ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటి నుంచే కసరత్తు కూడా తారక్ చేస్తున్నారని, బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా ఎక్కువగానే జరుగుతుందని అంటున్నారు.

 

కేవలం తెలుగు సినిమాలే కాకుండా ఉత్తరాది సినిమాలను కూడా నిర్మించాలని భావిస్తున్నాడట. అయితే సినిమా పేరు విషయంలో మాత్రం ఏ స్పష్టతా ఇప్పటి వరకు రాలేదు. పేరుని తన చిన్న కుమారుడి పేరు పెట్టె యోచనలో ఉన్నారని అన్నారు. కాని హరికృష్ణ పేరు పెట్టాలని భావిస్తున్నారట. భార్గవ్ హరి ప్రొడక్షన్స్ అని చిన్న కొడుకు, తండ్రి పేరు పేరు వచ్చేలా పెట్టె ఆలోచనలో ఉన్నారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే మాత్రం ఈ పేరు ఖరారు అవుతుందని అంటున్నారు. కాగా,  ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: