ఇటీవల తమిళంలో ఘన విజయం సొంతం  చేసుకున్న ‘అసురన్‌’ చిత్ర దర్శకుడు వేట్రి మారన్‌ మరో సినిమాకు సిద్ధం అవ్వడం చాల విశేషం. ఇక  ఈ దర్శకుడు  అసురన్‌ హిట్‌తో మంచి ఫామ్‌లో ముందుకు దూసుకొని పోతున్నాడు.  ఈ దర్శకుడు తన తర్వాత సినిమా తమిళ స్టార్‌ సూర్యతో కలిసి చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు  కోలీవుడ్‌ పరిశ్రమ తెలియ చేసిన  సంగతి అందరికి  తెలిసిందే కదా. కానీ ఇప్పుడు అక్షరాలా అదే నిజం అవ్వబోతుంది. గత కొన్ని రోజులగా సరైన హిట్లు సాధించలేకున్నా సూర్యతో వేట్రి మారన్‌ సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు  సమాచారం. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్‌ తను  నిర్మించ బోతున్నాడు.

 

తొలిసారి సూర్యతో ‘దర్శకుడు వేట్రిమారన్‌  సినిమాను చేయబోతున్నాడు. ఇక మరో వైపు ఈ చిత్రంలో నేను ఒక భాగస్వామి అయ్యి నందుకు చాలా  ఆనందంగా ఉంది’ అని నిర్మాత ఎస్‌ థను తెలియచేయడం జరిగింది. ఇక ఇది సూర్యకు 40వ సినిమా కావడం కూడా చాల విశేషంగా మారింది . ఇక సినిమా చిత్రీకరణ వచ్చే సంవత్సరం  ప్రారంభం చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలియచేయడం జరిగింది.

 

Image result for ఆకాశమే నీ హద్దురా’

 

  ఇక వీరి కాంబినేషన్‌ సూర్యకు ఎలా కలిసొస్తుందో లేదో చూడాలి మరి. ఇక మరో వైపు సూర్య తాజాగా నటించిన ‘సూరరై పోట్రు’ వచ్చే సంవత్సరంలో   విడుదలకు సిద్ధంగా ఉనట్లు తెలిపారు. ఈ సినిమాలో మొదటి సరిగా సూర్య రాప్‌ సాంగ్‌ పాడడం జరిగింది. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల అవ్వబోయితుంది. ఈ సినిమా ద్వారా నైనా సూర్య తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందో లేదో చూడాలి మరి, లేక నిరాశ మిగిలిస్తుందో వేచి ఉండాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: