తాజాగా చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో 66వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక 2018 సంవత్సరానికి గాను దక్షిణాది సినిమా  పరిశ్రమకు  అత్యుతమ ప్రతిభ చూపించిన  నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానం చేయడం జరిగింది. ఇక  ఈ వేడుకకు తెలుగు, త‌మిళ‌, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు పెద్ద ఎత్తున హాజరు అవ్వడం జరిగింది. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో  మహానటి, రంగస్థలం చిత్రాలు పలు విభాగాలకు వాటి  సత్తా నిరూపించుకున్నాయి. ఇక  రంగస్థలం సినిమాకి కాను రామ్‌చరణ్‌ కు ఉత్తమ నటుడిగా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఇక సీనియర్‌ నటి సావిత్రి జీవిత ఆధారంగా వచ్చిన మహానటి ఉత్తమ సినిమాకి, అదే చిత్రానికి సంబంధించి కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది.  ఇక ఉత్తమ సహాయనటుడిగా అరవింద సమేత చిత్రానికి గానూ జగపతిబాబుకు  అవార్డు  ప్రదానం చేయడం జరిగింది.

 


ఇక పలు తెలుగు ఇండస్ట్రీకి  సంబంధించి   అవార్డు  ప్రధాన వివరాలు ఇలా..

మహానటికి  : ఉత్తమ చిత్రం 
నాగ్‌ అశ్విన్ ‌(మహానటి) :  ఉత్తమ దర్శకుడుగా 
రామ్‌చరణ్‌ (రంగస్థలం) :  ఉత్తమ నటుడుగా  
కీర్తి సురేశ్‌ ( మహానటి ):  ఉత్తమ నటిగా  
దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి  ): ఉత్తమ నటుడుగా (విమర్శకుల విభాగం కింద) 
రష్మిక మందన్న (గీతా గోవిందం ) : ఉత్తమ నటిగా (విమర్శకుల విభాగం కింద) 
అససూయ భరద్వాజ్‌ (రంగస్థలం) : ఉత్తమ సహాయ నటిగా - 
జగపతిబాబు (అరవింద సమేత) :  ఉత్తమ సహాయ నటుడుగా  
రత్నవేలు (రంగస్థలం)  :  ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా  
 దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం):  ఉత్తమ మ్యూజిక్‌ అల్బమ్‌గా 
చంద్రబోస్‌(ఎంత సక్కగున్నావే పాటకు - రంగస్థలం) : ఉత్తమ గేయ రచయితగా  
సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాటకు - గీత గోవిందం): ఉత్తమ నేపథ్య గాయకుడుగా  
శ్రేయా ఘోషాల్‌ (మందరా మందరా-భాగమతి పాటకు): ఉత్తమ నేపథ్య గాయనిగా  అవార్డులు సొంతం చేసుకోవడం  జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: