‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు ముందు పూరీ పేరు చెపితే చాలామంది హీరోలు నిర్మాతలు భయపడిపోయారు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ ఘనవిజయం సాధించడంతో తిరిగి పూరీ మ్యానియా ప్రారంభం అయింది. అయితే ఈమ్యానియాను తన కొడుకు ఆకాష్ కు ఉపయోగించి అతడికి హిట్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ పూరీ లేటెస్ట్ గా తీస్తున్న ‘రొమాంటిక్’ మూవీలో చాలచోట్ల ‘ఇస్మార్ట్ శంకర్’ ఛాయలు కనిపిస్తాయి అన్నప్రచారం జరుగుతోంది. 

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో రామ్ పాత్రకు ఉన్న నెగిటివ్ షెడ్ లానే ఆకాష్ పాత్రకు కూడ నెగిటివ్ టచ్ ఇచ్చారని ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో హీరోయిన్స్ నిధి అగర్వాల్ నభా నటేష్‌ ల అందాల ఆరబోత సీన్స్ ఉన్నట్లుగా ‘రొమాంటిక్’ మూవీలో కూడ విపరీతమైన ఎక్స్ పోజింగ్ సీన్స్ ఉన్నాయి అన్నప్రచారం జరుగుతోంది. అయితే అన్నిసార్లు ఇలాంటి ఎక్స్ ఎక్స్‌పోజింగ్ వర్కవుటవుతుందనే గ్యారెంటీ ఏమిలేదు అంటూ పూరీ తన కొడుకు ఆకాష్ గురించి చేస్తున్న ప్రయోగం పై కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

దీనికితోడు ఈమూవీ కోసం పూరి స్వయంగా రాసిన ఒకపాటను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈపాటతో జనాల దృష్టిని ఆకర్షించడం పూరి అండ్ టీమ్ సక్సస్ అయిందనే చెప్పాలి. పాటలా కాకుండా మాటలతో కొంచెం భిన్నంగా ఈపాటను తీర్చిదిద్దారు. ప్రేమ గురించి పూరి ఉపోద్ఘాతం ఆతర్వాత హీరో హీరోయిన్లు ఒకరిపై ఒకరికున్న ప్రేమ మోహాన్ని తెలిపే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొందరు ఈపాట చాలా కళాత్మకంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరికొందరు ఈపాటలో హీరోయిన్ సెక్సీ అందాలను వర్ణించడం తప్ప మరేమీ గొప్పతనం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పూరి తన కొడుకు ఆకాష్ కోసం చేస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ తరహా ప్రయోగాలను చూసి అతడితో త్వరలో సినిమా చేయబోతున్న విజయ్ దేవరకొండ భయపడిపోతున్నట్లు టాక్. తన మూవీలో కూడ ఇలాంటి ‘ఇస్మార్ట్ శంకర్’ సీన్స్ ను రిపీట్ చేసి తన పై కూడ ప్రయోగం చేస్తాడా అంటూ ఈసినిమా కథకు సంబంధించిన ప్రతి సీన్ గురించి పూరీతో చాల వివరంగా చర్చిస్తూ తన అభిప్రాయాలను తెలుపుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: