లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఆతరువాత రాజకీయాల బాట పట్టి ఒక దశాబ్ద కాలంపాటు రాజకీయాలలో కూడ తనదైన ముద్రను వేసుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విజయశాంతి రాజకీయాలలో కూడ కనుమరుగైపోయింది. 

ఇలాంటి పరిస్థితులలో తిరిగి విజయశాంతిని సినిమాల వైపుకు తీసుకు రావడానికి అనీల్ రావిపూడి చాల కష్టపడటమే కాకుండా ఆమెకు రెండు కోట్ల భారీ పారితోషికం ఇచ్చుకోవలసి వచ్చింది అని అంటారు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను ఒప్పుకునే ముందు తన పారితోషికంతో పాటు విజయశాంతి అనీల్ రావిపూడికి మరొక కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం విజయశాంతికి 55 సంవత్సరాల వయస్సు దగ్గర పడటంతో ఆమె ఈ సినిమాలో నటించే తన పాత్రకు సంబంధించిన తన ఫేస్ లుక్ కు విఎఫ్ఎక్స్ వర్క్ చేయించాలి అని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం చాలామంది సీనియర్ హీరోలకు సీనియర్ హీరోయిన్స్ కు వారి ముఖంలో ముడతలు కనిపించకుండా చేయడానికి డిఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. 

‘సైరా’ లో చిరంజీవికోసం ‘వెంకీమామ’ లో వెంకటేష్ కోసం ‘మన్మధుడు 2’ నాగార్జున కోసం రూలర్ మూవీలో బాలయ్య కోసం ఈ టెక్నాలజీని వాడారు. వాస్తవానికి ఈ టెక్నాలజీ చాల ఖరీదైనది. అయినప్పటికీ విజయశాంతికి ఇచ్చిన మాట పరాకారం ఆమె లుక్ యంగ్ గా కనిపించడానికి ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ లో అనీల్ రావిపూడి విజయశాంతి ఫేస్ లుక్ గురించి చాల శ్రద్ధపట్టి పనులు చేయిస్తున్నట్లు టాక్. దీనితో ఈ మూవీ బడ్జెట్ పెరిగినా నిర్మాతలు పట్టించుకోవడంలేదని సమాచారం. ఒకవైపు భారీ పారితోషికంతో పాటు విజయశాంతి లుక్ కోసం పెట్టిన ఖర్చులతో ఆమె ఇమేజ్ ‘సరిలేరు నీక్వ్వరు’ మ్యానియాను పెంచి భారీ కలక్షన్స్ రప్పించడానికి ఏమ్తవ్రకు సహకరిస్తుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: