ఇండస్ట్రీలో సెలెబ్రెటీల వారసులు హీరోలుగా ఎంటర్ కావడం ఎప్పటి నుంచో జరుగుతున్న పరిణామం. ఇప్పుడు ఆట్రెండ్ ను కొనసాగిస్తూ కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘మత్తు వదలరా’ మూవీ రేపు విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం స్వయంగా రాజమౌళి కుటుంబం అంతా రంగంలోకి దిగి శ్రీ సింహ కు క్రేజ్ ఏర్పరచడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి ఈమధ్య జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన రాజమౌళిమూవీ గురించి మాట్లాడుతూ వేసిన జోక్ చాలామందికి అనేక సందేహాలు కలిగిస్తోంది. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయింది అని లీకులు ఇస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ అనుకున్న డేట్ కు ఈ ఏడాది జూలై 30న విడుదల అవుతుంది అంటూ ఈ మూవీ నిర్మాతలు ఓపెన్ గానే చెపుతున్నారు. 

ఈసందర్భంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న యాంకర్ సుమ రాజమౌళిని చనువుతో ఒక ప్రశ్న వేసింది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అనుకున్నట్లుగా ఈఏడాది జూలై 30న విడుదల అవుతుందా అంటూ రాజమౌళికి ప్రశ్న వేసి అతడి నుండి సమాధానం రాబట్టడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఈ ప్రశ్నకు రాజమౌళి డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా మరొక ట్విస్ట్ ఇచ్చాడు. 

‘మత్తు వదలరా’ లాంటి చిన్న మూవీని సంవత్సర కాలం తీసినప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ సినిమాను తీయడానికి తనకు ఎంత సమయం కావాలి అంటూ జోక్ చేసాడు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న డేట్ కు కాకుండా వాయిదా పడుతుంది అన్న సంకేతాలు రాజమౌళి నోటి వెంట వ్యూహాత్మకంగా వచ్చాయా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: