మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చారో.. అంతమందినీ తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో మెగా అభిమానుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. మెగాస్టార్ చిరంజీవి సంపాదించుకున్న అద్భుతమైన అస్తిగా మెగా అభిమానులు మెగా వారసులకు అండగా ప్రతి అడుగులోనూ నిలబడ్డారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అండదండలే ఓ మెగా వారసుడికి ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను కూడా ఆదరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెగా ప్రిన్స్ గా వరుణ్ తేజ్ సినిమాల్లోకి వచ్చి నేటితో 5ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.

 

 

రామ్ చరణ్ తర్వాత కొణిదెల ఇంటి రెండో వారసుడిగా వచ్చాడు వరుణ్ తేజ్. 2014 డిసెంబర్ 24న విడుదలైన తన మొదటి సినిమా ముకుంద రిలీజై నేటికి 5 ఏళ్ళు పూర్తయ్యాయి. చంటి అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తన నటనలో పరిణితి చూపించి ఆకట్టుకున్నాడు. నిజానికి మెగా వారసత్వానికి విరుద్ధంగా క్లాస్ టైటిల్, కథతో వచ్చాడు వరుణ్. మాస్ క్రేజ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలుండటం సహజం. కానీ.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టెక్కుతూ మెగా వారసత్వాన్ని నిలబెట్టడానే చెప్పాలి. ముఖ్యంగా తాను ఎంచుకున్న కథలతో ఆశ్చర్యపరుస్తూ కంచె, అంతరిక్షం, గడ్డలకొండ గణేశ్.. లాంటి విభిన్న కథాంశాలను ఎంచుకుని మెగా హీరోల్లో భిన్నంగా వెళ్తూ సక్సెస్ అవుతున్నాడు. 2018లో తొలిప్రేమ, ఫిదా.. సినిమాలతో రెండు హిట్లిచ్చి మెగా వారసత్వాన్ని ఘనంగా చాటాడు.

 

 

నాగబాబు తనయుడిగా వచ్చినా వరుణ్ కు మెగాస్టార్ చిరంజీవి, మెగాభిమానుల అండదండలు, బాబాయ్ పవన్ కల్యాణ్, పవర్ స్టార్ అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. యాక్షన్, డాన్సులు, ఫైట్స్.. లో తన గ్రేస్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాను ఎంచుకున్న స్క్రిప్టులే తనను విభిన్న కథానాయకుడిగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయనేది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: