బాలకృష్ణ సల్మాన్ ఖాన్ సినిమాల మధ్య చిక్కుకున్న సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండగే’ మూవీ కనీస విజయం అయినా సాధిస్తుందా అంటూ మొదట్లో కొన్ని సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే సాయి తేజ్ దశ తిరిగి ‘దబంగ్ 3’ ‘రూలర్’ ఇలా రెండు సినిమాలు ఫెయిల్ కావడంతో ‘ప్రతిరోజు పండగే’ మూవీకి ప్రక్షకుల ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది.

ఈ ఊహించని సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి తేజ్ ఈ వీకెండ్ లో కూడ ఈ మూవీకి మంచి కలక్షన్స్ రప్పించాలి అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీ ప్రమోషన్ ను కొనసాగిస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కొనసాగిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ మెగా మేనల్లుడు లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ చరణ్ అల్లు అర్జున్ డాన్సింగ్ స్కిల్స్ కు ర్యాంకింగ్స్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఇదే ఇంటర్వ్యూలో సాయి తేజ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ తన దృష్టిలో చిరంజీవి కంటే గొప్ప డాన్సర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు లేరు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే చిరంజీవి తరువాత తనకు జూనియర్ డాన్స్ నచ్చుతుందని అతడి డాన్స్ లో క్లాసికల్ టచ్ ఉంటుంది అంటూ కామెంట్ చేసాడు. 

ఇదే సందర్భంలో అల్లు అర్జున్ పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ బన్నీ తన స్టెప్స్ లో తనకు తానుగా ఆలోచించి కొంత క్రియేటివిటీ జోడిస్తాడని ఆ క్రియేటివిటి వల్ల బన్నీ స్టెప్స్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది అన్న తన అభిప్రాయాన్ని తెలియచేసాడు. ఇక చివరిగా చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ డాన్స్ స్టెప్స్ లో ఒక గ్రేస్ ఉంటుందని దానితో చరణ్ స్టెప్స్ చూసే వారికి స్క్రీన్ పై ఒక మ్యానియా ఏర్పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ ప్రస్తుత తరం టాప్ యంగ్ హీరోలు అందరికీ సమన్యాయం పాటిస్తూ మహేష్ ప్రభాస్ లను మరిచిపోవడం విశేషం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: