సినీరంగంలో రహస్య వివాహాలు మామూలే.. అసలే హీరోయిన్లు.. వీళ్లు పెళ్లి వార్తలు బయటకు వస్తే డిమాండ్ పోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు తమ పెళ్లిళ్ల గురించి సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అయితే హీరోయిన్ శ్రియ గత ఏడాది మార్చిలో ఓ రష్యన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రియ భర్త రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొశీవ్‌.

 

శ్రియ, ఆండ్రీలది ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత కూడా శ్రియ అప్పుడప్పుుడు సినిమాల్లో మెరుస్తూనే ఉంది. దక్షిణాదితోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవలే ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’లో అతిథిగా కనిపించింది. ప్రస్తుతం ‘తడ్కా’, ‘సండక్కరి’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

 

రాజస్థాన్‌లో జరిగిన శ్రియ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆమె, కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. పెళ్లి గురించి అత్యంత గోప్యత పాటించారు. అందుకే అప్పట్లో పెళ్లి వివరాలేవీ బయటికి రాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శ్రియ శ్రియ ఈ మేరేజ్ గురించి స్పందించింది. జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే తనకు ఇష్టమని.. అందుకే పెళ్లి గురించి బహిరంగంగా చెప్పలేదని అంటోంది శ్రియ.

 

ఆమె ఇంకా ఏమందంటే..  ‘నేను, ఆండ్రీ వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లు అవుతోందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఇందులో దాయడానికి ఏమీ లేదు. కానీ నేను నా జీవితాన్ని ప్రైవేట్‌గా, సింపుల్‌గా ఉంచుకోవడానికే ఇష్టపడతా. నటనే నా ఆహారం, దాన్ని ఇలానే కొనసాగిస్తా. నా భర్త కూడా ఈ విషయంలో చాలా మద్దతుగా ఉంటారు. నేను ఎక్కువగా పనిచేస్తూ బిజీగా ఉంటే.. ఆయన ఆనందిస్తుంటారు. తనకు అదే ఇష్టం’ అని శ్రియ చెప్పుకొచ్చింది.

                           

అయితే పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగింది.. ఎంత సీక్రెట్ గా జరిగింది అన్నది విషయమే కాదు.. కానీ ఆ పెళ్లి ఎంత విజయవంతమైంది.. ఆ బంధం ఎంత ధృఢంగా నిలబడింది అన్నదే ప్రధానం. శ్రియ మాటలు చూస్తుంటే.. ఆ బంధం ఆనందకరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: