ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ ఈ రెండు సినిమాలు వరసగా బాలయ్యకు దెబ్బేశాయి.  జైసింహా సినిమా తరువాత బాలయ్యకు హిట్ లేకపోవడం బాధాకరం.  అప్పుడెప్పుడో బాలయ్య చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి ఓ మోస్తరుగా ఆడింది.  అంతకు ముందు కూడా హిట్ కోసం ఇబ్బందులు పడుతున్న బాలయ్యకు సింహా, లెజెండ్ సినిమాలతో హిట్ అందించాడు బోయపాటి.  ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తరువాత మరో హిట్ అందుకోలేదు. జైసింహా సినిమా ఓ మోస్తరుగా హిట్ అయ్యింది.  


మూవీ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఇందులో రెండు సినిమాలు వచ్చాయి.  ఈ రెండు కోసం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే కాదు, నిర్మాతగా చేసిన బాలయ్యకు ఏకంగా రూ.70 కోట్ల మేర నష్టం వాటిల్లింది.  నిర్మాతగా మొదటి సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు.  అందుకే సొంత నిర్మాణ సంస్థను బాలయ్య పక్కన పెట్టేశారు.  బయట నిర్మాతలతో సినిమా చేస్తే ఏ బాధ ఉండదనుకున్నాడేమో అందుకే సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  


ఎలాగైనా రూలర్ సినిమాతో హిట్ కొట్టి మరలా లైన్లోకి రావాలని అనుకున్నా బాలయ్యకు కుదరడం లేదు.  సినిమా ప్లాప్ టాక్ వచ్చింది.  దీంతో బోయపాటి సినిమాను తీస్తున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బడ్జెట్ ను తగ్గించారని టాక్ వస్తోంది.  బోయపాటి చరణ్ తో తీసిన వినయ విధేయ రామ సినిమా ఫెయిల్ అయ్యింది.  దీంతో పాటుగా బాలయ్య రూలర్ కూడా ఫెయిల్ కావడంతో ఇబ్బందులు పడ్డారని అంటున్నారు.  కానీ, ఇందులో నిజం లేదని, బోయపాటికి నిర్మాత పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని సమాచారం.  


ఇకపోతే, ఈ సినిమా యూపీ బ్యాక్ డ్రాప్ కథతో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  యూపీలో  ముఖ్యంగా వారణాసిలో సినిమాను ఎక్కువభాగం షూట్ చేయబోతున్నారు.  ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారట.  ఇప్పటికే ఒక హీరోయిన్ గా క్యాథరిన్ ను సెట్ చేశారు.  మరో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇకపోతే, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకుంటున్నట్టు సమాచారం.  జనవరి 3 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.  సమ్మర్ స్పెషల్ గా సినిమాను తీసుకురాబోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: