గుడ్ న్యూస్ అంటే అందరూ ఆసక్తిగా వినేందుకు ముందుకు వస్తారు.  ఏం చెప్పబోతున్నారా అని ఆసక్తిగా వినేందుకు సిద్ధం అవుతారు.  కానీ, ఆ గుడ్ న్యూస్ ఓ విషాదాన్ని చెప్తూనే నవ్వులు పూయిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  గుడ్ న్యూస్ విని కడుపు చెక్కలయ్యేలా నవ్వితే బాప్ రే అది అంత ఈజీనా అనుకోవచ్చు.  సినిమా కాబట్టి ఈజీనే.  వైద్యులు ఆపరేషన్ చేస్తూ కడుపులో కత్తెర్లు, వాచ్ లు ఇతర వస్తువులు పెట్టి కుట్టేశారని వార్తల్లో చదివాము... సినిమాల్లో చూశాం.  కొంతమంది వైద్యులు ఆపరేషన్ చేసి పిల్లాడిని బయటకు తీస్తూ తల కోసిన సందర్భాలు ఉన్నాయి.  


అయితే, ఇప్పుడు కొత్తగా వైద్యులు ఫలదీకరణ విషయంలో కూడా పొరపాటు చేస్తున్నారట.  ఇది కేవలం సినిమాలోనే అండి.  బయటకాదు.  అయినా  సినిమా మీడియా పవర్ ఫుల్ మీడియా కదా.. విమర్శలు రావడం సహజమే.  కోర్టులో కేసులు కూడా వేస్తారు.  అదే ఇక్కడ జరిగింది. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జిత్, కియారాలు జంటగా నటించిన గుడ్ న్యూస్ సినిమా ఈ శుక్రవారం రోజున రిలీజ్ కాబోతున్నది.  


ఇప్పటికే అక్షయ్ కుమార్ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు.  కామెడీని ప్రధానాంశంగా పెట్టి సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు.  ఈ సినిమా కూడా కామెడీ ప్రధానాంశంగా రూపొందిన సినిమానే.  ఇందులో ఈ నలుగురి జంటకు పిల్లలు పుట్టకపోవడంతో కృత్రిమ పద్దతిలో పిల్లల్ని కనాలని అనుకుంటారు.  అక్షయ్ - కరీనా, దిల్జిత్ - కియారాలు వైద్యులను సంప్రదిస్తారు.  అయితే, అక్షయ్ శుక్రకణాలతో కియారాతోనూ, దిల్జిత్  శుక్రకణాలను కరీనాతోనూ ఫలదీకరణ చేస్తారు.  


తప్పు జరిగిందని తెలుసుకున్న వైద్యులు ఈ నలుగురికి ఆ విషయం చెప్పడంతో హంగామా మొదలౌతుంది.  ఈ హంగామా ఏంటి ఎలా ఉన్నది అన్నది మిగతా కథ.  ఈ కథలో ఇదే మెయిన్ ట్విస్ట్ అని చెప్తున్నారు.  అక్కడి నుంచి వచ్చే ప్రతి సన్నివేశం కూడా చాలా ఫన్నీగా ఉండబోతుందని తెలుస్తోంది.  ఫన్ క్రియేట్ చేస్తూనే ఓ మెసేజ్ కూడా ఇచ్చారట.  ఈ మూవీ డిసెంబర్ 27 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మినిమమ్ ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని అంటున్నారు.  మరి ఏ మేరకు విజయం సాధిస్తుందో ఇప్పుడు చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: