క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటన మాత్రమే కాదు అతడి ప్రవర్తన కూడ విభిన్నంగా ఉంటుంది. తాను నటంచే సినిమాల కథల ఎంపిక నుండి వాటి ప్రచారం వరకు చాల కొత్త పద్ధతులను విజయ్ అనుసరిస్తూ ఉంటాడు. అందువల్లనే అతి తక్కువ కాలంలో అతడికి అంత మంచి ఇమేజ్ వచ్చింది అంటారు. 

ఇలాంటి పరిస్థితులలో నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకలు సందర్భంగా విజయ్ శాంటాగా మారిపోయాడు. తన అభిమానులకు క్రిస్మస్ తాతలా బహుమతులు ఇస్తాను అంటూ ‘దేవర శాంటా’ అనే హ్యాష్ ట్యాగ్ తో మీకందరికి ఏం కావాలో చెప్పాలి’ అంటూ ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన వచ్చిన కొద్ది గంటలలోనే వైరల్ గా మారిపోవడంతో అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. 

ఈ సందర్భంలో కొందరు తమకు ఫోన్ చేసి మాట్లాడమని కోరితే మరికొందరు విజయ్ ని సామాజిక కార్యక్రమాలు బాగా చేయమని సలహాలు ఇచ్చారు. అయితే మరికొందరు విజయ్ ని కొన్ని విచిత్రమైన కోరికలు అడుగుతూ ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు. కొందరు అభిమానులు తమకు ఆర్ధిక బాధలు ఎక్కువగా ఉన్నాయని చెపుతూ ఆర్ధిక సహాయం అడిగితే మరికొందరు తమకు విజయ్ పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగాలు ఇప్పించ వలసిందిగా కోరారు. మరికొందరైతే క్రిస్మస్ సందర్భంగా కియారా అద్వానికి వోడ్కా పంపించవచ్చు కదా అంటూ జోక్స్ చేసారు. 

అయితే అభిమానుల నుంచి వచ్చిన ఇన్ని కోరికలలో తాను ఎన్ని తీరుస్తాడో చెప్పలేక విజయ్ దేవరకొండ తికమక పడ్డాడు. వాస్తవానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ తన అభిమానులతో ఛాట్ చేయడం సర్వసాధారణమే అయినా తన అభిమానుల కోరికలను క్రిస్మస్ తాతలా తీరుస్తాను అంటూ లేనిపోని ఆశలు పెట్టి చిక్కులలో విజయ్ చిక్కుకున్నాడు అనుకోవాలి. తన లేటెస్ట్ మూవీల గురించి కంటే విజయ్ ని అతడు అభిమానులు తమ వింత కోరికలతో స్వీట్ టార్చర్ పెట్టడం క్రిస్మస్ రోజున అందరికి జోష్ ఇచ్చింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: