సాధారణంగా చిత్ర పరిశ్రమలో చాలా మంది కాపీ పేస్ట్ కు  అలవాటు పడిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఒక డైరెక్షర్ ఒకటి చేశారంటే దాన్ని పక్కాగా మరొకరు చేస్తుంటారు. అందుకే సినిమా నుపోలిన సినిమాలో, లేదా వచ్చిన కథతో మళ్ళీ కథలు రావడమో జరుగుతుంది. అందుకే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాపు అవుతున్నాయి. పెద్ద హీరోలు సైతం మరో హీరో ను ఫాలో అవుతూ  వస్తున్నా సంగతి తెలిసిందే.. 


ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకు పూర్తి న్యాయం చేసే వ్యక్తులలో హీరో మహేష్ కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇద్దరూ కూడా నటుల పరంగా సినిమాకు ఏ లోటు రానీయరు అన్న విషయం తెలిసిందే. సినిమా కోస౦ తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. సినిమాలో నటన పరంగా గాని, సినిమాలో మాట్లాడే మాటలు కానీ, ఇలా చూసుకుంటే ఏదైనా సరే వీరు ఒకరికొకరు పోటీ పడుతుంటారాన్న విషయం వేరేలా చెప్పనక్కర్లేదు. 

 

తాజాగా మహేష్ బాబు ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నడానీ వార్తలు వినపడుతున్నాయి.. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసతో అదరగొట్టాడు. ఆ సినిమాకు అదే ప్లస్ పాయింట్ అయింది కూడా. అందులో ఆ వాయిస్ కి రాయలసీమలో ఉండే జనం కూడా ఫిదా అయిపోయారు. దీనితో అక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ప్రతీ సన్నివేశంలో రాయలసీమలో పుట్టి పెరిగిన వాడిగా ఎన్టీఆర్ పలికించిన డైలాగులకు సీమలో అభిమానులు ఊగిపోయారు.


ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్  అదే ఫాలో అవుతున్నాడని టాలివుడ్ వర్గాల్లో వినపడుతుంది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కొన్ని సీన్లలో రాయలసీమ యాస లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడట మహేష్ బాబు. దీనిపై ఎన్టీఆర్ నుంచి కొన్ని సలహాలను కూడా సూపర్ స్టార్ తీసుకున్నాడని టాక్. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ యాస మహేష్ ని కూడా ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాలో అలా ట్రై చేస్తున్నాడట. సినిమా అంత కాకపోయినా కూడా కొంతవరకు ఈ యాసలో అలరించనున్నాడని సమాచారం..  

మరింత సమాచారం తెలుసుకోండి: