దాదాపు దశాబ్దం క్రితం టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టాడు థమన్. కెరీర్ మొదట్లోనే వరుస హిట్లతో థమన్ కు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే అవకాశాలు వచ్చాయి. కానీ రొటీన్ సంగీతం అందిస్తున్నాడనే విమర్శలు ఒకవైపు, కాపీ క్యాట్ ఆరోపణలు మరోవైపు థమన్ కెరీర్ ను ఇబ్బంది పెట్టాయి. ఒక దశలో టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్ కెరీర్ ముగిసినట్లే అని వార్తలు కూడా వచ్చాయి. 
 
అలాంటి సమయంలో వరుణ్ తేజ్ రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాతో థమన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తొలిప్రేమ సినిమా తరువాత ఎన్టీయార్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత సినిమాకు థమన్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. అరవింద సమేత హిట్ కావడంతో థమన్ కు అవకాశాలు పెరిగాయి. థమన్ టాలీవుడ్ లో సక్సెస్ కావటానికి అసలు కారణమేంటో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 
 
థమన్ మాట్లాడుతూ సినిమాలకు సాంగ్స్ రికార్డింగ్ హైదరాబాద్ లో చేసినా రీ రికార్డింగ్ మాత్రం చెన్నైలోనే చేస్తానని చెప్పుకొచ్చారు. చెన్నైలో తనకు కావాల్సిన మ్యూజిక్ ప్లేయర్స్ దొరుకుతారని వారిని హైదరాబాద్ కు తీసుకొనిరావాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని థమన్ చెప్పారు. అందువలన తానే చెన్నై వెళ్లి అక్కడే రీరికార్డింగ్ చేసుకుంటానని చెప్పారు. 
 
మిగతా సంగీత దర్శకులతో పోలిస్తే తాను పారితోషికం తక్కువగానే తీసుకుంటానని మిగతా సంగీత దర్శకులకు ఇచ్చిన పారితోషికంలో కేవలం 50 శాతం మాత్రమే తాను తీసుకుంటానని థమన్ చెప్పుకొచ్చారు. పోటీ ప్రపంచంలో పోటీతత్వం ఉన్న సమయంలో మాత్రమే టాలెంట్ బయటపడుతుందని థమన్ అన్నారు. మంచి సంగీతం అందించటం ముఖ్యమని అందుకోసం అవసరమైతే డబుల్ వర్క్ కూడా చేస్తానని థమన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం థమన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: