ఆర్ఆర్ఆర్ సినిమా భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 70శాతం మేర షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నది.  మరో 30 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నది.  ఈ షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నది ఆర్ఆర్ఆర్.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో విదేశీ నటీనటులు నటిస్తున్నారు.  బాలీవుడ్ నుంచి అలియా భట్, అజయ్ దేవగణ్ లు నటిస్తున్నారు.  


పాన్ ఇండియా మూవీగా తెరక్కుతున్న ఈ సినిమాలో రాజమౌళి అనేక ప్రయోగాలు చేస్తున్నారు.  చరిత్రలో కలవని ఇద్దరు సమరయోధులు సినిమాలో కలిస్తే ఎలా ఉంటుంది అనే దానికి దృశ్యరూపం ఇవ్వబోతున్నారు.  ఎలా ఇద్దర్ని కలిపారు అన్నది సినిమాలో చూపించబోతున్నారు.  ఇదే టాపిక్ ఇప్పుడు హైలైట్ అయ్యింది.  అందరిలోనూ ఇదే చర్చ జరుగుతున్నది.  ఆ ఇద్దర్ని ఎలా కలిపారు.  ఎలా కలిపారు.  


అందరిలోనూ ఇదే ఉత్కంఠత.  ఈ ఉత్కంఠతతోనే బిజినెస్ చేసుకుంటోంది.  అది మాములు బిజినెస్ కాదు.  ఇప్పటికే ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా బిజినెస్ చేసుకున్నట్టు సమాచారం.  ఇక ఏరియాల్లో చూసుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమా దాదాపుగా రూ. 13 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసుకుంది.  సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్ కానీ, ఒక్క సీన్ కానీ బయటకు రాలేదు.  


కానీ, సినిమా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ స్థాయిలో బిజినెస్ చేసుకోవడం అన్నది షాక్ ఇస్తోంది.  ఆ జిల్లా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సాహసం చేశారని చెప్పుకోవాలి.  ఈ స్థాయిలో ఒక జిల్లా నుంచి రాబట్టుకోవాలి అంటే సినిమా బ్లాక్ బస్టర్ కావాలి.  అంతేకాదు, ఆ సినిమా రిలీజైన రోజున జిల్లా థియేటర్స్ లో మరో సినిమా ఉండకూడదు.  కనీసం నెల రోజులపాటు సినిమా థియేటర్లో మోతమోగితేనే డబ్బులు వస్తాయి.  లేదంటే మాత్రం డిస్ట్రిబ్యూటర్ కు ఇబ్బందులు వస్తాయి.  రాజమౌళి సినిమా కాబట్టి మినిమమ్ గ్యాంరేంటి ఉంటుంది.  అందుకే ఈ సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ పెరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: