టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న హీరో ఈ జనరేషన్ లో ఎవరు అనే ప్రశ్న వస్తే ఠక్కున వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సంబంధంలేని స్టార్ డమ్ పవన్ కల్యాణ్ కు ఉంది. పవన్ కల్యాణ్ సినీ కెరీర్, పొలిటికల్ కెరీర్ ఎంతటి సంచలనం సృష్టిస్తూంటాయో.. ఆయన పర్సనల్ విషయాలు కూడా అంతే సంచలనం సృష్టిస్తూంటాయి. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ గురింవి ఏ విషయం, పిక్ బయటకు వచ్చినా సెన్సేషనే అని చెప్పాలి.

 

 

పవన్ కల్యాణ్రేణు దేశాయ్ పిల్లలు అకిరానందన్, ఆద్య గురించి తెలిసిన విషయమే. పిల్లలిద్దరూ రేణూ దేశాయ్ వద్దే పెరుగుతున్న విషయం కూడా తెలిసిందే. సోషల్ మీడియాలో వారి పిక్స్ ఎప్పుడు బయటకొచ్చినా విపరీతంగా వైరల్ అవుతూంటాయి. ప్రస్తుతం అకీరా – ఆద్య ఇద్దరూ కలిసున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. చెల్లెలు ఆద్యను అకీరా ఎత్తుకున్న ఫోటో పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘1,2,3.. అని కౌంట్ చేయగానే నేను వెంటనే వచ్చేస్తాను. అకీరా, ఆద్య.. ఇద్దరూ సరదా పిల్లలే.. మరి నేను’ అని తన వాల్ లో రాసుకుంది. ‘మంచి పిక్ పోస్ట్ చేశారు మేడం’ అంటూ అభిమానులు రిప్లై ఇస్తున్నారు.

 

 

గతంలో వీరి పిక్స్ సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. గతంతో మహేశ్ బాబుతో అకిరా ఫోటో దిగినప్పుడూ ఓ సెన్షేషనే క్రియేట్ అయింది. అకీరాను హీరోగా చూడాలనేది పవర్ స్టార్ అభిమానుల కోరిక. మరి వీరి కోరికను అకీరా ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: