టాలీవుడ్ గా మారక ముందు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన నలుగురు సూపర్ స్టార్స్.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. ప్రస్తుతం సీనియర్లుగా టాలీవుడ్ లో తమ హవా ఇంకా కొనసాగిస్తున్నారు. వీరిలో చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వస్తే.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ మాత్రం సినిమాల్లోనే ఉన్నారు. ప్రస్తుత జనరేషన్ హీరోలకు పోటీనిస్తూ వారు సినిమాలు చేస్తున్నారు. అయితే.. వీరిలో చిరంజీవి మాత్రం తన స్టార్ డమ్ ను పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా కొనసాగిస్తూండడం విశేషం. ఈ ఏడది వీరందరి సినిమాలు విడుదలపై సందడి చేశాయి.

 

 

వచ్చే ఏడాది కూడా వీరి హవా కొనసాగనుంది. సీనియర్లైన తర్వాత ఆచి తూచి సినిమాలు చేయాల్సిన పరిస్థితి. వయసు, సీనియార్టీ ప్రాతిపదికన వారు కథలను ఎంచుకుని చేయాలి. వచ్చే ఏడాదికి మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కొరటాల శివతో చేయబోయే సినిమాను పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేస్తారని అంటున్నారు, బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. వేసవికి ఈ సినిమా విడుదల చేస్తారని అంటున్నారు. నాగార్జున కూడా ఇటీవలే వైల్డ్ డాగ్ అనే సినిమా ప్రారంభించాడు. అది కూడా వేసవికి వస్తుందని అంటున్నారు. వెంకటేశ్ చేయబోయే అసురన్ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో నలుగురు సీనియర్ హీరోలు వచ్చే ఏడాది బిజీగానే ఉండబోతున్నారు.

 

 

ఈ ఏడాదిలో చిరంజీవి సైరా, బాలకృష్ణ ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు, నాగార్జున మన్మథుడు2, వెంకటేశ్ ఎఫ్2, వెంకీమామ.. సినిమాలతో వచ్చారు. చిరంజీవి, వెంకటేశ్ సినిమాలు హిట్లు కాగా బాలకృష్ణ, నాగార్జున ఫ్లాపులయ్యాయి. అయినా వీరి సినిమాలకు వచ్చిన ఇబ్బంది లేదు. ప్రేక్షకులు కూడా వీరి నుంచి మంచి సినిమాలు వస్తే ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: