నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 2019లో వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో సినిమాల ట్రాక్ పరంగా బాలకృష్ణకు తగిలిన దెబ్బ మామూలుది కాదు. ఏడాది ప్రారంభంలో భారీ ఫ్లాప్ ఇచ్చిన బాలయ్య ఏడాది చివర కూడా అంతే భారీ ఫ్లాప్ ఇచ్చాడు. బహుశా ఏ హీరోకి ఇలా జరిగుండదేమో. తండ్రి బయోపిక్ చేసి పరువు పోగొట్టుకున్న బాలయ్యకు.. కమర్షియల్ యాంగిల్ లో చేసిన రూలర్ కూడా బాగా దెబ్బేసింది.

 

 

యంగ్ హీరో సాయి తేజ్ తో పోటీ పడ్డ బాలయ్య రేసులో వెనుకబడిపోయాడు. ఈ సినిమా దాదాపు 40కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. బాలయ్యే రెమ్యునరేషన్ కింద పది కోట్లు తీసుకున్నాడని వినికిడి. ఇప్పుడీ సినిమా ఇప్పటివరకూ 7కోట్లు కూడా వసులు చేయలేదని ట్రేడ్ వర్గాల అంచనా. కెరీర్ లో మొదటిసారిగా తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక నిర్మాత సి.కల్యాణ్ బ్యానర్ అంటే తన సొంత బ్యానర్ కింద లెక్క అని బాలయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు. దీంతో ఈ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని కల్యాణ్ కు చెప్పాడట. కానీ.. సి.కల్యాణ్ అందుకు సిద్ధంగా లేడని ఫిలింనగర్ టాక్.

 

 

బాలకృష్ణతో కల్యాణ్ చేసిన మూడు సినిమాలు ఇదే పరిస్థితి. పరమవీరచక్ర, జై సింహ, రూలర్ సినిమాలేవీ కల్యాణ్ కు లాభాలు తెచ్చిపెట్టలేదు. మధ్యలో వచ్చిన జై సింహ పర్వాలేదనిపించింది. పవన్ అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడం ఈ సినిమాకు కలిసొచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది. రూలర్ దెబ్బ కల్యాణ్ కే కాకుండా దర్శకుడు బోయపాటి శ్రీనుకి కూడా బాగానే తగిలింది. ఈ సినిమాపై బడ్జెట్ ప్రభావం పడి తక్కువలో తీయాలని బాలయ్య షరతులు పెట్టాడని సినీ వర్గాల టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: