సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సినీ తారలకు లవ్ అఫైర్ లు అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది.. రోజుకో చోట మీడియాకు దర్శనమిస్తూ అందరిచేత కామెంట్లు చేస్తూ ఉంటారు..కానీ ఏమాత్రం పట్టిచుకోకుండా వస్తుంటారు.. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినీ తారల కన్న టీవీ తారాలే ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.. అలా వార్తల్లో నిలుస్తున్నారు.. 


ఇకపోతే తెలుగు సినిమాలలో ఒకప్పుడు మెరిసిన హిరోయిన్ త్రిష..తనకంటూ ప్రత్యేకమైన ప్రేమ కథలు లేవని చెప్పుకొచ్చింది నటి త్రిష. వరుసగా రెండు మూడు చిత్రాలు ఫ్లాప్‌ అయితే ఈ అమ్మడి పనైపోయింది అన్న పరిస్థితి ఒకప్పుడు ఉండేదేమోగానీ ఇప్పుడు లేదు. కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయినా, ఆ తరువాత నటించిన ఒక్క చిత్రం హిట్‌ అయితే మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అందుకు ఉదాహరణ నటి త్రిషనే. ఈ చెన్నై చిన్నది 17 ఏళ్లుగా నటిస్తూ వస్తోంది..

 

మధ్యలో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండి.. మళ్లీ ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. కాగా ఈ మధ్య ఆమె చేసిన సినిమాలన్నీ కూడా ఆమెకు ఫలితాలను ఇవ్వలేక పోయింది...తాజాగా వచ్చిన 96 సినిమా లో విజయ్ సేతుపతి సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువగా హిట్ అయిన విషయం తెలిసిందే..


ఇది ఇలా ఉండగా ఈ మధ్య  ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ 96 చిత్ర విజయం ఆశించనిదని చెప్పింది. అందులో తనది మంచి కథా పాత్ర అని తెలుసు అని చెప్పిది. అలాంటి కథా పాత్రతో కూడిన చిత్రాలను ఇంతకు ముందే చూశానని అంది.అలాంటి పాత్రలో తాను నటించిన చిత్రం అంతగా పేరు తెచ్చిపెడుతుందని ఊహించలేదని అంది. చిత్రం సక్సెస్‌ అవుతుందని, అందులోని రామ్, జాను కథాపాత్రల్లో ప్రేక్షకులు తమను చూసుకుంటారని భావించానని చెప్పింది.ప్రస్తుతం ఈమె చిరంజీవి సరసన ఓ సినిమాలో నటిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: