తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ ఏంచేసినా కూడా అవి సంచలనాలు సృష్టిస్తాయన్న విషయం తెలిసిందే.. ఈ మేరకు హైదరాబాద్ లో బ్యూటిఫుల్ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రీ న్యూయార్ ప్రయివేట్ పార్టీ కన్నుల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వర్మ చేసిన డ్యాన్స్ రచ్చలు తారాస్థాయికి చేరాయనడంలో ఎటువంటిసందేహం లేదు.

 

హీరోయిన్ తో కలిసి చిందేసిన వర్మ కుర్రాడులాగా ప్రవర్తించాడు. ఆయన సినిమాలే కాదు ఏదైనా చేయడంలో ముందుంటాడని మరో సారి నిరూపించారు.ఈ సందర్బంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. నా మొదటి గర్ల్ ఫ్రెండ్ మా అమ్మ అని చెప్పారు. మా అమ్మ నేను మంచివాడిని అనుకుంటుంది.. కానీ, నేను చెడ్డవాడినే అంటూ వర్మ అన్నారు. తర్వాత వర్మ అమ్మగారు మాట్లాడుతూ అనంతరం వర్మ అమ్మ మాట్లాడుతూ.. రామ్ అంత చెడ్డవాడు కాదు. కోపం ఎక్కువే కానీ, మంచివాడు అంటూ ఆమె అన్నారు.  

 

ఇకపోతే ఫుల్ ఫామ్లో ఉన్న వర్మ  నోటికొచ్చింది మాట్లాడాడు అనడంలో సందేహం లేదు ... ఈ సందర్బంగా రాముడు మంచి బాలుడు అనే పదం తెలుగులో ఘోరమైన తిట్టు అని వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.అలాగే వర్మ సోదరి కూడా ఈ సందర్బంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పార్టీకి బ్యూటిఫుల్ చిత్రం బృందం. తదితరులు పాల్గొని సందడి చేశారు. 

 

అలా డ్యాన్స్ చేస్తూ ఉన్న వర్మ మద్యం ఎక్కువ కావడంతో హీరోయిన్ తో స్టెప్పులు వెయ్యలేక పాప కాళ్ళ మీద పడిన సంగతి తెలిసిందే.. హీరోయిన్ కాళ్ళు పట్టుకున్న వర్మ అంటూ వరుస ట్రోల్స్ అందుకుంటున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యూటిఫుల్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వర్మ ఎంటర్ డి డ్రాగన్ గర్ల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: