చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ మూవీ షూటింగ్ జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మూవీలోని  చిరంజీవి పాత్రకు రెండు షేడ్స్ ఉన్న నేపధ్యంలో ఈ పాత్రకు సంబంధించిన లుక్ రీత్యా కొంత సన్నగా కనపడవలసి ఉంది. 

దీనితో  ఒక ట్రైనర్ ని పెట్టుకుని బరువు తగ్గే ప్రయత్నాలు చిరంజీవి చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడంలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించి ఎలర్ట్ అయిన చిరంజీవి తన వ్యక్తిగత వైద్యులను సంప్రదించినట్లు టాక్. చిరంజీవి వయసు రీత్యా ఎక్కువ ప్రెషర్ పెట్టడం మంచిది కాదనీ నెమ్మదిగా బరువు తగ్గుతుంది కాని వారాలలో మార్పులు రావడం కష్టం అని వైద్యులు చిరంజీవికి సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ ను నెమ్మదిగా నడిపించి 2020 దసరా కు విడుదల అయ్యేలా ప్లాన్ చేద్దామని చిరంజీవి కొరటాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఈ మూవీ విడుదలకు  రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ తో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ప్రస్తుతం రాజమౌళి ఇస్తున్న లీకులను బట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ 2020 జూలై 30న విడుదల కాకపోవచ్చు అనీ ఆ మూవీ వచ్చే ఏడాది దసరాకు మాత్రమే వస్తుందనీ ఈ కారణం వలెనే ఈ మూవీ బిజినెస్ విషయంలో బయ్యర్లకు ఎటువంటి మాట ఇవ్వవద్దు అంటూ రాజమౌళి దానయ్యకు సూచించినట్లు గాసిప్పులు గుప్పు మంటున్నాయి. అదే పరిస్థితి  ఎదురైతే కొరటాల చిరంజీవి మూవీని 2020 దసరాకు కాకుండా 2021 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన కూడా చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో రాజమౌళి మనసులో అసలు విషయం ఏముందో తెలుసుకునే ప్రయత్నంచేయమని చిరంజీవి చరణ్ కు చెప్పినట్లు టాక్..    

మరింత సమాచారం తెలుసుకోండి: