తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లుగా రాణించిన హీరోయిన్లు ఉన్నారు. వారంతా పలు హిట్ సినిమాల్లో నటించి స్టార్ డమ్ అనుభవించిన వారే. వారిలో ఈ దశాబ్దంలో వచ్చిన వారు ఉన్నారు. గత దశాబ్దంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఇంకా రాణిస్తున్న వారూ ఉన్నారు. వారిలో కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన వారూ ఉన్నారు. పెళ్లి చేసుకుని కూడా సినిమాలు చేస్తున్న హీరోయిన్లు ఉన్నారు. మరికొందరికి పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన వారూ.. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వారూ కొందరు ఉన్నారు.

 

 

శ్రియ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది. గతేడాది శ్రియ రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చీవ్ ను పెళ్లాడింది. 2001లో మొదటి సినిమా చేసిన శ్రియ ఇప్పటికీ పలు సినిమాలు చేస్తోంది. ప్రియమణి బిజినెస్ మేన్ ముస్తఫాను పెళ్లాడింది. సమంత – నాగచైతన్యల పెళ్లి ఈ దశాబ్దపు హైలైట్ అనే చెప్పాలి. నటి స్వాతి హైదరాబాద్ కు చెందిన వికాస్ ను పెళ్లాడింది. నటి భావన కేరళకు చెందిన సినీ నిర్మాత నవీన్ ను పెళ్లాడింది. సమీరా రెడ్డి అక్షయ్ వర్దేను ప్రేమ వివాహం చేసుకుంది. నమిత కన్నడ దర్శకుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేశ్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. మరికొందరు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు ప్రేమ వ్యవహారాల వార్తలు షికారు చేస్తున్నాయి.

 

 

వీరు కాక మరికొందరికి జీవితంలో చేదు ఫలితాలు ఎదురయ్యాయనే చెప్పాలి. త్రిషకు చెన్నైకు చెందిన వరుణ్ తో నిశ్చితార్ధం కాగా.. పెళ్లి వరకూ వెళ్లలేక పోయింది. అమలా పాల్ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడాకులు ఇచ్చేసింది. అంజలి కూడా నటుడు జైతో సాగించిన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడిందనే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: