యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెరైటీ సినిమాలకు భిన్నంగా ప్రయోగాలు చేయ‌డానికి ఇష్టప‌డ‌డు. ఎప్పుడూ త‌న‌కు అల‌వాటైన క‌మ‌ర్షియ‌ల్ దారిలోనే సినిమాలలో నటించి గ్యారంటీ హిట్ కొట్టాలని చూస్తూ ఉంటాడు. అక్కడే జూనియర్ ప్లాన్స్ బెడిసి కొడుతున్నాయి. మిగతా హీరోలతో హిట్ సినిమాలను తీసిన దర్శకులను వల వేసి పట్టుకుని వారి చేత తన స్థాయి సినిమాలను తీయిస్తూ ఉంటాడు జూనియర్.  కానీ మిగతా హీరోల దగ్గర హిట్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న దర్శకులు జూనియర్ దగ్గరకు వచ్చే సరికి చతికల పడిపోతున్నారు. జూనియర్ ప్రస్తుతం ఆడుతున్న ఈ సేఫ్ గేమ్ ఎన్టీఆర్ కు పెద్దగా కలిసి రావడంలేదు. కొత్త ద‌ర్శకుల‌కు అవ‌కాశం ఇవ్వడం ఎన్టీఆర్ విష‌యంలో చాల అరుదు అనే చెప్పాలి. అలాంటిది జూనియర్ వ‌క్కంతం వంశీ క‌థ‌కు ఓకే చెప్పి, అత‌న్ని డైరెక్టర్ చేస్తాన‌ని మాట ఇచ్చి ఇప్పుడు ఆ రచయితకు హ్యాండ్ ఇచ్చాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.  ఎన్టీఆర్‌ కోసo వ‌క్కంతం కూడా మ‌రే ప‌ని పెట్టుకోకుండా అదిరిపోయే క‌థ‌ను సిద్ధం చేస్తే ప్రస్తుతం జూనియర్ ఇతడిని కాదని సుకుమార్ వంక చూస్తున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దర్శకులతో ఇల మ్యూజికల్ చైర్స్ ఆడటం జూనియర్ కెరియర్ కు మంచిది కాదు అంటు విశ్లేషకులు విశ్లేషణలు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: