మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడల్లా మనకు ఒక ప్రేరణకలుగుతుంది. నిత్యం మారుతూ వెళ్ళే ఈ కాలప్రవాహంలో సంవత్సరాలు మారడం అనేది పెద్ద  విషయం కాకపోయినా ఇది నిరాటంకంగా నిత్యం జరిగే ప్రక్రియ. మనం గోడకు నూతన సంవత్సర క్యాలెండరును వేలాడదీసిన వెంటనే ముందుగా ఎన్నోవిషయాలు గణాంకాలు మారిపోయిన సంగతులు మనకు గుర్తుకు రావడంసహజం. 


ఈనూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనకుమనం జాగృతులం  అయి భవిష్యత్ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసే దిశలో మారుతున్న కాలంలో మనజీవితాలు ఆసక్తికరమైన అంశాలతో పాటు ఇంకా మనపై ప్రభావం చూపిన అంశాలు గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోవడం సర్వసాధారణం. ఈరోజు మన జీవితాలలోకి తొంగిచూస్తున్న 2020 గురించి వార్తలు ఎప్పటి నుంచో వింటున్నాం.  


విజన్ 2020 లీడ్ ఇండియా 2020 అంటూ గత రెండు దశాబ్దాలుగా ఈమాటలు వినని భారతీయుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్లో కానీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో ఈపదాలు ఎక్కువగా వినపడేవి. వ్యక్తిగత సామాజిక అభివృద్ధి నేపథ్యంలో ఈ నినాదాలు ముందుకు వచ్చాయన్న విషయం తెలిసిందే. ఎంతోమంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్న 2020 పై  ఒక  హెచ్చరిక కూడ ఇప్పుడు వినిపిస్తోంది.    


కొత్త సంవత్సరంలో తేదీ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది దీని సారాంశం. ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే జనవరి నుంచి తేదీలు 01/01/2020గా ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది అలవాటుగా 01/01/20 అని రాసే అవకాశం ఉంటుంది.  దీనితో అలా రాసిన తేదీని  01/01/2000 నుంచి 01/01/2099 వరకు ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది అంటూ కొందరు ఆర్ధిక నిపుణులు న్యాయనిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు  ముఖ్యంగా  ఇది ఒప్పందాల విషయంలో ఇతర కాంట్రాక్టుల విషయంలో చెక్‌ల విషయంలో జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అని ఆర్ధిక నిపుణులు హెక్చరికలు ఇస్తున్నారు. దీనివల్ల మోసపోయే ఛాన్సులు చాలా ఉన్నాయని అంటున్నారు.  అందువల్ల ఈ సంవత్సరం అంతా ఎవరైనా డేట్ రాసేటప్పుడు చాలాజాగ్రత్తగా  వహించాలని చెపుతూ ఈవిషయాలను అందరు గుర్తుచుకుని ఈ ఏడాది డేట్ రాసే విషయం పై జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటూ కొందరు ఇస్తున్న హెచ్చరికలను చూసి ఈ ఏడాది ఇంకా ప్రారంభం కాకుండానే చాలమంది కొత్త సంవత్సరం ఆనందాల మధ్య లోలోపుల భయపడుతున్నారు అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కధనంలో పేర్కొంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: