నిన్న పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు సంఘీభావాన్ని తెలుపుతూ ఆ ప్రాంతంలో చేసిన పర్యటనకు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర అసహనానికి లోనైన పవన్ ఒక ఆశ్చర్యకర కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తనను పోలీసులు అడ్డుకున్నప్పటికీ ముళ్ళ కంచెలను దాటి తన హీరోయిజాన్ని చూపెడుతూ ఈ కామెంట్స్ చేసాడు. 

ఇక్కడ నుండి అమరావతి అనే నినాదాలు చేయవద్దని ‘జై ఆంద్రా జైజై ఆంధ్రా’ అంటూ నినాదాలు చేయమని పిలుపు ఇవ్వడంతో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో  లేదా అన్న సందేహం కలుగుతుంది. గతంలో పలు బహిరంగ సభలలో ఆవేశంగా ఊగి పోయిన పవన్ ను చూసిన చాలామంది మాత్రం ఇంతటి ఆవేశం గతంలో పవన్ లో చూడలేదు అంటూ చాలామంది కామెంట్స్ చేసారు.

ఇది చాలదు అన్నట్లుగా పవన్ నిన్న ఆవేశంతో అన్న మాటల పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉన్నప్పుడు  ముగ్గురు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కు ఉంటారా అంటూ పవన్ వింత ప్రశ్నలు వేసాడు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే రాజధాని మార్పు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు జగన్ ప్రభుత్వానికి ఉంది అంటూ భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకత్వం కూడ భావిస్తోంది అన్న విధంగా లీకులు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో జనం మధ్యలోకి వెళ్ళి పవన్ ఎన్ని పోరాటాలు చేసినా జనం వస్తారు కాని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను మార్చే స్థాయిలో తుది వరకు పవన్ పోరాటం చేయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు తాను ఎన్ని సార్లు చెప్పినా తన మాటలు వినని ఓటర్లు ఇప్పుడు కష్టాలు వచ్చాయి అని తన దగ్గరకు వస్తే తాను సానుభూతిని చూపెట్టగలను కాని అంతకన్నా తాను చేయడానికి తాను భగవంతుడుని కాను అని పవన్ అన్న మాటలలో ఎన్నికలలో తాను ఓడిపోయినందుకు పవన్ కలుగిన నైరాశ్యం కనిపిస్తోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: