జనవరి 1 వ తేదీ వచ్చింది అంటే సంక్రాంతి సీజన్ ప్రారంభమైనట్టే.  ప్రతి ఏడాది జనవరి 1 వ తేదీన కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  అలా వచ్చిన వాటిల్లో కొన్ని హిట్ అవుతుంటాయి.  అయితే, పెద్ద హీరోల సినిమాలు ఏవీకూడా జనవరి 1 వ తేదీన రిలీజ్ చేయడానికి అంగీకరించరు.  ఎందుకంటే, జనవరి 1 న రిలీజ్ చేస్తే, ఏదైనా తేడా జరిగితే.. ఏడాది మొత్తం అలానే ఉంటుందేమో అని భయపడతారు.  అందుకే ఆరోజున సినిమా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించరు.

 
ఇక ఇదిలా ఉంటె, ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి జనవరి 3 వ తేదీ వరకు మొత్తం 11 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  ఒక్క జనవరి 1 వ తేదీనే ఆరు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నది.  ఇందులో ప్రముఖంగా రామ్ గోపాల్ వర్మ బ్యూటిఫుల్ రిలీజ్ ఉంది.  ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. నైనా గంగూలీ అంగాంగ ప్రదర్శన తప్పించి సినిమాలో పెద్దగా ఏమిలేదు.  ఈ సినిమాతో పాటుగా సత్యప్రకాష్ దర్శకుడిగా మారి తీసిన ఉల్లాల ఉల్లాల సినిమా వస్తోంది.  


ఇది కూడా అడల్ట్ కంటెంట్ అధికంగా ఉన్న సినిమానే కావడం విశేషం.  అడల్ట్ కంటెంట్ సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి.  వీటితో పాటుగా డబ్బింగ్ సినిమాలైనా  రథేరా, అతడే శ్రీమన్నారాయణ, తూటా, రాజా నరసింహా కూడా వస్తున్నాయి.  ఇవి వస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు.  ఇందులో అతడే శ్రీమన్నారాయణ సినిమాకు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తున్నారు.  అటు మలయాళం సినిమా రాజా నరసింహ కూడా మంచిగానే ప్రమోషన్ చేశారు.  


అయితే, తెలుగులో ఎంతవరకు హిట్ అవుతాయి అన్నది తెలియాలి.  ఇక జనవరి 3 వ తేదీన వైఫ్సినిమా వస్తోంది.  ఇది కూడా అడల్ట్ సినిమానే కావడం విశేషం. ఈ సినిమాతో పాటుగా ఉత్తర, సమరం, నమస్తే నేస్తమా, కళాకారుడు, బూమరాంగ్ వస్తున్నాయి. మొత్తం 11 సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీటికి థియేటర్లు ఎంతవరకు దొరుకుతాయి అన్నది చూడాలి.  మరోవైపు డిసెంబర్ 13 న వచ్చిన వెంకిమామ, డిసెంబర్ 20 న వచ్చిన ప్రతిరోజు పండగే, రూలర్ సినిమాలు ఇంకా థియేటర్లోనే ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: