ఖైదీ నెంబర్ 150తో  మళ్ళీ హీరోగా సినిమాల్లోకి రీ ఎంట్రీ  ఇచ్చిన  మెగా స్టార్ చిరంజీవి ఆ సినిమా తో  బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని  పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆ చిత్రం  తరువాత ఆయన రెండేళ్లు గ్యాప్ ఇచ్చి పీరియాడికల్ మూవీ  సైరా తో  గత ఏడాది  దసరా కు  ప్రేక్షకులముందుకు వచ్చాడు,  భారీ అంచనాల మధ్య  విడుదలైన ఈ చిత్రం  సూపర్  పాజిటివ్ రివ్యూస్ ను  సొంతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా  200కోట్ల వసూళ్లను రాబట్టింది.  అయితే ఈ చిత్రం  తెలుగు తోపాటు  హిందీ , తమిళ , మలయాళ , కన్నడ  భాషల్లో  విడుదల కాగా   తెలుగు , కన్నడ లో తప్ప  మిగితా  మూడు  భాషల్లో  భారీ  పరాజయాన్ని మూటగట్టుకుంది.  
 
 
ఇక ఈ చిత్రం తరువాత చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ  తో  తన 152 వ  చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఈ చిత్రం  కోసం  కోకాపేట లో ప్రత్యేకంగా  మిడిల్ క్లాస్ కాలనీ సెట్  వేశారు.  ఆక్కడే ఈ రోజు ఈ సినిమా షూటింగ్  స్టార్ట్ అయ్యింది.  20రోజుల పాటు  జరుగనున్న ఈషెడ్యూల్ లో ఓ పాట తో  పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  ఈ చిత్రానికి 'ఆచార్య'  అనే టైటిల్ ను పెట్టనున్నట్లు  ఫిలిం నగర్  నుండి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈటైటిల్  విషయంలో క్లారిటీ రానుంది.
 
ఇక ఈ చిత్రాన్నిఈఏడాది ఆగస్టు 14న విడుదలచేయనున్నారని సమాచారం. సోషల్ మెసేజ్ తో  కమర్షియల్ ఎంటర్ టైనర్లను తెరకెక్కిస్తూ  బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ  వస్తున్న కొరటాల శివ  ఈ చిత్రాన్ని కూడా అదే  ఫార్ములా తో తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ  సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నిమ్యాట్నీ  ఎంటర్ టైన్మెంట్స్  , కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్  నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: