దేవుడిని స్మరించుకునేందుకు గుడికి వెళ్తాం.. దేవతలను పూజించేందుకు ఆలయాలకు వెళ్తాం.. అంటే ఆ దేవుళ్లంటే మనకు ఎంతో భక్తి, ఆరాధన, ప్రేమ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. తార అభిమానులకు కూడా అంతే సేమ్ ఫీలింగ్. తమ అభిమాన తార అంటే వారికి అంత భక్తి, పిచ్చి. అందుకే ఆమెకు ఏకంగా గుడి కట్టి పూజించడం ప్రారంభించారు. ఇంతకీ ఎవరామె అంటారా ఆమె ఒకనాటి తమిళ హీరోయిన్ ఖుష్బు.

 

అసలు ఆమెకు ఎందుకు గుడి కట్టారు.. అప్పుడు ఆమె ఫీలింగ్స్ ఏంటి.. ఈ విషయాలను ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. మరి ఈ ఖుష్బూ గుడి వెనుక కథ ఏంటి? తెలుసుకుందామా..

 

1991లో ‘చిన్నతంబి’ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో ఖుష్బూకు గుడి కట్టేశారట ఫ్యాన్స్. అప్పటికి కుష్బూకు తమిళ్ చదవటం కూడా రాదట. అంతే కాదు.. న్యూస్‌ పేపర్‌ చూసే సమయం కూడా లేదు. వరుస షూటింగ్‌లో బిజీగా ఉండేది కుష్బూ. అప్పుడే ఆమెకు ఎవరో చెప్పారట. తిరుచ్చిలో కుష్బూకు గుడి కట్టారని. అంటే... అప్పటికే అది జరిగి రెండేళ్లు అయిపోయిందట. కుష్బూ కూడా స్పందించలేదు.

 

ఎందుకంటే కుష్బూ మొదటి నుంచి ఫ్యాన్స్‌ అసోసియేషన్లు ఉండటాన్ని ఇష్టపడదు. తమ కోసం వాళ్లు తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టి, పాలాభిషేకాలు, కట్‌అవుట్‌లు పెడుతుంటారు. ఆ డబ్బులు వాళ్ల కుటుంబం కోసం వినియోగిస్తే మంచిదని కుష్బూ చెబుతుంటుంది. అవే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయమని చెబుతుంటుంది. అయితే, వాళ్లు చూపే ప్రేమాభిమానాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోదట.

 

విచిత్రం ఏంటంటే.. అంత ప్రేమగా తమ అభిమాన నటికి గుడి కట్టిన వాళ్లు.. అదే నటి గురించి వాళ్ల చేతులతోనే ఆ గుడిని కూల్చేశారు. ఎందుకంటే.. స్త్రీస్వేచ్ఛ, యువతులకు సెక్స్ ఎడ్యుకేషన్, పెళ్లి కాక ముందే సెక్స్ వంటి అంశాలపై అప్పట్లో కుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనే ఆమె ఫ్యాన్స్ ఆగ్రహంతో ఆమె గుడి కూల్చేశారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: