సాధారణంగా శుక్రు వారం రోజున సినిమాలు విడుదల కావడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. వాస్తవానికి ఈసారి సంక్రాంతి పండుగ వీకెండ్ లో కాకుండా వారం మధ్యలో రావడంలో ఈసారి టాప్ హీరోల సినిమాలకు సమస్యలు ఏర్పడ్డాయి. 

దీనితో సంక్రాంతి పండుగకు మరీ దూరంగా కాకుండా కేవలం రెండు మూడు రోజులు గ్యాప్ తో 11న ‘సరిలేరు నీకెవ్వరు’ ’12న అల వైకుంఠపురములో’ మూవీల విడుదలకు రాజీ కుదిర్చారు. అయితే బన్నీ ఆలోచనలు మారిపోయి తనకు జనవరి 10వ తేదీ పై మోజు పడుతుండటంతో ఇగో దెబ్బతిని మహేష్ కూడ జనవరి 10కి గురి పెట్టాడు. 

ఇప్పుడు ఇలాంటి పరిణామాలతో ఎలర్ట్ అయిన త్రివిక్రమ్ కు అదేవిధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాత అనీల్ సుంకరకు జనవరి 10 ఒక హారర్ డేలా కనిపించడంతో వారిద్దరు రంగంలోకి దిగి ఆ హారర్ డే చరిత్రను మహేష్ బన్నీలకు జ్ఞాపకం చేస్తున్నట్లు టాక్. జనవరి 10 2014లో మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ మూవీ ఫ్లాప్ కావడంతో ఆ మూవీ నిర్మాత అనీల్ రావిపూడి చాల ఆర్ధికంగా నష్ట పోవడంతో ఆ నష్టాల నుండి తేరుకుని ఇప్పటికి పుంజుకుని మహేష్ తో ‘సరిలేరునీకేవ్వారు’ తీసుతున్నాడు. 

2018 జనవరి 10న త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో తీసిన ‘అజ్ఞాతవాసి’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాల కాలం పట్టింది. దీనితో త్రివిక్రమ్ అనీల్ సుంకర లు జనవరి 10 అంటేనే భయపడిపోతూ ఎట్టి పరిస్థితులలోను ఇగోలు వద్దని మహేష్ బన్నీలకు నచ్చచెప్పడానికి చిరంజీవిని కలిసి తమ గోడు తమ భయాలు వివరిస్తున్నట్లు టాక్. ఈ 10వ తేదీ నెగిటివ్ సెంటిమెంట్ చూసి అయినా బన్నీ మహేష్  లు మారుతారా లేకుంటే తమ ఇగో ల కోసం త్రివిక్రమ్ అనీల్ సుంకర్ ల సెంటిమెంట్ ను పక్కకుపెడతారా అన్న విషయం ఈరోజు తెలిపోతుది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: