తెలుగు సినిమాలలో ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించడంలో దీట్టైన దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ ఈయన సినిమాలలో సెంటిమెంట్ ఉంటుంది అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి సారి కొత్తగా తన మాటల మంత్రాల వల్ల సినిమాలను సూపర్ హిట్ అందుకుంటున్నాడు..అది ఆయన గ్రేడ్ మార్క్ అనే చెప్పాలి.. 

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో మనం చూసాం. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ కన్సర్ట్ జనవరి 6న జరగనుంది. ఇప్పటివరకూ విడుదలైన నాలుగు పాటలను పెద్ద సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతగా థమన్ అండ్ కో లైవ్ లో ఈ పాటలను పెర్ఫర్మ్ చేయనున్నారు. ఇక సినిమా జనవరి 12న విడుదల అవుతుందని టీమ్ ఎప్పటినుండో చెబుతూ వస్తోన్న విషయం తెల్సిందే.

 

ఇప్పటవరకూ ఈ చిత్రం నుండి బయటకు వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు మరియు సాంగ్స్ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చాయి.. అందుకే ఈ సినిమా బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టీమ్ 12కే ఫిక్స్ అయింది. 10వ తేదీ ఖాళీ ఉన్నా కానీ ఆ రోజుకి రావడానికి ఇష్టపడలేదు. దీనికి హారిక అండ్ హాసిని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అజ్ఞాతవాసి సెంటిమెంట్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అజ్ఞాతవాసి 10కే వచ్చి డిజాస్టర్ అయింది. అందుకే 12కి రావాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వచ్చారు.

 

 ఔట్పుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. సంక్రాంతికి ఎంత ముందు వస్తే అంత మంచిది కాబట్టి శుక్రవారం రిలీజ్ వదులుకోకూడదు అని భావిస్తున్నాడట. పైగా సరిలేరు కంటే ఒకరోజు ముందు విడుదలైతే తమకే మంచిదని భావించి ఇప్పుడు జనవరి 10 రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా అయితే 10కి వచ్చి హిట్ కొట్టి సెంటిమెంట్ ను బ్రేక్ చేసినట్టు కూడా ఉంటుందని త్రివిక్రమ్ భావనగా తెలుస్తోంది.. ఎది ఏమైనా కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అభిప్రాపడుతున్నారు.. మరి బన్నీ కి విజయం అందుతుందో లేదో ఈ సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: