కొందరు అంతే.. అనుభవించు రాజా అనే టైపులో ఉంటారు. ఎవరైనా అదేమని అడిగితే పుట్టింది.. పెరిగింది..ఎందుకూ..అంటూ ఓ సాంగ్ వేసుకుంటారు. మనం లైఫ్ మన ఇష్టం గురూ.. ఎవరేమనుకుంటే మనకేం.. మనం ఎంజాయ్ చేశామా లేదా.. అంతే.. ఎవరో ఏదో అనుకుంటారని ఫీలైతే.. ఏమీ చేయలేం అంటూ జీవన సూత్రాలు వల్లె వేస్తారు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ కూడా అదే కోవలోకి వస్తాడు.

 

అర్జున్ రాంపాల్ కు 20 ఏళ్ల క్రితమే పెళ్లయింది. పాపం.. 20 ఏళ్ల తర్వాత ఎందుకో కాపురంలో కలతలు వచ్చాయి. 20 ఏళ్లు అయ్యింది కదా.. ఇక ఎడ్జస్ట్ అయిపోదాం అనుకునే టైపు కానే కాదు మన అర్జున్ రాంపాల్ ది. అందుకే.. ఆమెతో రెండు దశాబ్దాల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశాడు. 2018 మేలో విడిపోతున్నట్టు పరస్పరం నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

 

ఆ తర్వాత ఈ రసిక శిఖామణి విదేశీ మోడల్ కం ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్లా దిమెత్రియస్ ని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగకుండానే ఆమెను తల్లిని చేసేశాడు. ఆ బుడ్డోడికి అరిక్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన ఆనందాన్ని మరింత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అర్జున్ రాంపాల్.. వారసుడిని చంకనేసుకుని విహారం ప్రారంభించారు. ఎంచక్కా మీడియాకు ఫోజులిస్తూ ఘాటు రోమాన్స్ లో మునిగితేలుతున్నారు. ఇప్పుడు ఈ జంట ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

ఓ బిడ్డ పుట్టాక కూడా ఇంత ఘాటు రోమాన్సేంటి బాసూ..అది కూడా పబ్లిక్ ప్లేసులో అనుకునేవాళ్లు అనుకుంటున్నా డోన్ట్ కేర్ అంటోందీ జంట. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ జోడీ కలిసిందంటారా.. అర్జున్ రాంపాల్ - గాబ్రియెల్లా డెమెట్రైడ్స్ 2009 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పార్టీ తరువాత స్నేహితులయ్యారు. ఆ తర్వాత స్నేహం కాస్తా ప్రేమగా మారింది. గాబ్రియెల్లా జన్మస్థలం దక్షిణాఫ్రికా. ప్రపంచంలోని హాటెస్ట్ మోడల్ గా ... డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది. సొంత దేశంలోనే కాదు.. భారతదేశంలో తన మోడలింగ్ చేస్తోంది. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: