వైసీపీ పార్టీ నేతలలో చాలామందికి టాలీవుడ్ ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు జూనియర్ ఎన్టీయార్ తో మంచి సంబంధాలు ఉండటంతో పాటు జూనియర్ ఎన్టీయార్ తో సినిమాలు కూడా తీశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా గతంలో ప్రభాస్ వీవీ వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 
 
ప్రస్తుతం టాలీవుడ్ లోని ఒక యువ ఎంపీ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.వైసీపీ పార్టీలోని ఎంపీలలో ఒక ఎంపీకి టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లతో, నిర్మాతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాయలసీమకు చెందిన ఈ ఎంపీ సీఎం జగన్ కు కూడా అత్యంత సన్నిహితుడు. ఢిల్లీలో బాగా లాబీయింగ్ చేసే ఈ ఎంపీ త్వరలో సినిమాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లో ఈ ఎంపీ నిర్మాతగా సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
 
2014లో తొలిసారి ఎంపీ అయిన ఇతను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి, సినిమాల్లో రాజకీయాల్లో గుర్తింపు పొందిన నటుడి కూతురిపై పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎంపీకి దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. వ్యాపార, రాజకీయ రంగాలలో విజయం సాధించిన ఎంపీ ఇప్పుడు సినీ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడని సమాచారం. 
 
త్వరలో అధికారికంగా ఈ ఎంపీ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాల గురించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నా భారీ రెమ్యూనరేషన్ల వలన నిర్మాతలకు పెద్దగా లాభాలు రావటం లేదు. మరి ఇలాంటి సమయంలో ఈ ఎంపీ నిర్మాతగా టాలీవుడ్ లో విజయాలు అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. అతి త్వరలో ఈ నిర్మాత సినిమా మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: